డీలర్‌పై కేసు

Fri,August 9, 2019 02:02 AM

సైదాపూర్: మండలంలోని జాగీర్‌పల్లిలో చౌకధరల దుకాణం డీలర్‌పై 6ఏ కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ సీఐ అమృతరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జాగీర్‌పల్లి చౌకధరల దుకాణంలో గురువారం తనిఖీలు నిర్వహించగా సరుకుల నిల్వ, రికార్డుల్లో వివరాలకు తేడా ఉన్నట్లు తెలిపారు. దుకాణంలో అదనంగా 39 లీటర్ల కిరోసిన్ నిల్వ ఉండడంతో సీజ్ చేసి, డీలర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆయన వెంట డీటీ వేణుగోపాల్, ఎస్‌ఐ అరుణ్‌కుమార్, ఆర్‌ఐ అనిల్, తదితరులున్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles