రేషన్ బియ్యం పట్టివేత

Fri,August 9, 2019 02:01 AM

మానకొండూర్ రూరల్: అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా మానకొండూర్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో బుధవారం సీఐ సంతోష్‌కుమార్ సిబ్బందితో వెళ్లి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ శివారులో డీసీఎం వ్యాన్‌తో పాటు 3 ట్రాలీ ఆటోలను పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వాహనాలతో పాటు 116 క్వింటాళ్ల రేషన్ బియ్యం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గురువారం పౌర సరఫరాల శాఖ అధికారులకు అప్పగించినట్లు సీఐ వెల్లడించారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles