పాత్రికేయుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

Fri,August 9, 2019 02:00 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: పాత్రికేయుల సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని కరీంనగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. గురువారం నగర శివారులోని ఉజ్వల పార్కు వద్ద జర్నలిస్టుల కాలనీలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ గతంలో జర్నలిస్టులకు కేటాయించిన ఐదెకరాల స్థలంలో ప్రహరీ నిర్మించడంతోపాటు గ్రేటర్ కమ్యూనిటీగా తీర్చిదిద్దుతామన్నారు. కోటి రూపాయల వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ప్రకటించారు. జర్నలిస్టులకు స్థలాన్ని కేటాయించిన గత ప్రభుత్వాలు అభివృద్ధిని మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పనులకు నిధులు కేటాయించిందని తెలిపారు. ఇండ్ల స్థలాలు పొందని జర్నలిస్టులకు తిరిగి కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సునీల్‌రావు, వేణు, ఏవీ రమణ, జర్నలిస్టు సంఘాల నాయకులు నగునూరి శేఖర్, ఎలగందుల రవీందర్, కడపత్రి ప్రకాశ్‌రావు, ప్రేంకుమార్, తిరుపతి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles