రైతులను భాగస్వాములను చేయాలి

Fri,August 9, 2019 02:00 AM

తిమ్మాపూర్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఐదో విడుత హరితహారంలో రైతులను భాగస్వాములను చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కేతిరెడ్డి వనిత అధ్యక్షతన హరితహారంపై ప్రజాప్రతినిధులు, అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం హరితహారంలో గ్రామ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామానికి కనీసం 40వేల మొక్కలు నాటి సంరక్షించడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని కోరారు. రైతులను భాగస్వాములను చేస్తూ వారికి ఆదాయాన్ని ఇచ్చే మొక్కలను ఎక్కువగా పొలాల వద్ద నాటించాలన్నారు. వాటి సంరక్షణకు ఉపాధిహామీ ద్వారా నిధులను అందిస్తామని తెలిపారు.

చిన్న, సన్నకారు రైతులు తోటలు పెంచుకునేందుకు ఉద్యానశాఖ నుంచి పండ్ల మొక్కలను అందిస్తామని చెప్పారు. ప్రతి గ్రామంలో రోడ్లకు రెండు వైపులా ఐదు కిలోమీటర్ల వరకు మొక్కలు నాటాలని సూచించారు. పండ్ల మొక్కలతో పాటు ఇతర మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా నీటి వృథాను అరికట్టి, రాబోయే తరాలకు నీటి వనరులను అందించేలా కృషి చేయాలన్నారు. వర్షపు నీటిని నిల్వ చేసి తిరిగి వాడుకోవడంతో పాటు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు. భూగర్భ జలాలు పెరిగేందుకు రైతులు పొలాల వద్ద నీటి గుంతలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎంపీపీ, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటి నీరు పోశారు. అలాగే గోమూత్రం, పేడ, బెల్లం పిండితో జీవామృతం తయారు చేసే విధానాన్ని ప్రజాప్రతినిధులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో రాధ, తిమ్మాపూర్ సెక్షన్ డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రమౌళి, ఈవోపీఆర్డీ సురేందర్, ఏపీవో విజయ, పీఆర్ ఏఈ సురేందర్‌రెడ్డితో పాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles