డీవైఎస్‌వోకు శాట్ ఎండీ అభినందనలు

Fri,August 9, 2019 02:00 AM

కరీంనగర్ స్పోర్ట్స్: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు పతకాలు సాధించుటకు విశేష కృషిచేసిన రెజ్లింగ్ కోచ్, కరీంనగర్ డీవైఎస్‌వో జీ అశోక్‌కుమార్‌ను రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాట్) ఎండీ దినకర్‌బాబు గురువారం హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో అభినందించారు. జూలై 29 నుంచి ఆగస్టు 4 వరకు బల్గేరియాలోని సోఫియా నగరంలో జరిగిన ప్రపంచ కెడెట్ రెజ్లింగ్‌లో భారత జట్టు క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణలు ఇచ్చి పోటీల్లో ఒక రజత, ఒక కాంస్య పతకం సాధించడానికి అశోక్‌కుమార్ కృషి చేశారన్నారు.

భారత రెజ్లర్లు ఇటీవల జరిగిన ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఏడు పతకాలు సాధించడంలో హర్యానాలో అశోక్ ఇచ్చిన 3 నెలల శిక్షణ దోహదపడిందని పేర్కొన్నారు. నేడు కరీంనగర్‌కు రాక: ఇండియన్ రెజ్లింగ్ కోచ్‌గా భారత జట్టు క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణలు ఇచ్చి శుక్రవారం కరీంనగర్‌కు తిరిగి వస్తున్న డీవైఎస్‌వో అశోక్‌కుమార్‌కు రెజ్లింగ్ సమాఖ్య, జిల్లా యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం ఎన్టీఆర్ విగ్రహం నుంచి ప్రారంభించే ర్యాలీ అంబేద్కర్ స్టేడియం వరకు సాగుతుందనీ, క్రీడా, యువజన సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఇన్‌చార్జి డీవైఎస్‌వో ఎన్ సిద్దారెడ్డి కోరారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles