కార్మికులను అన్నివిధాలా ఆదుకుంటాం

Fri,August 9, 2019 01:59 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉండి ఆదుకుంటామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం స్థానిక కళాభారతిలో టీఆర్‌ఎస్ కార్మిక విభాగం అనుబంధ సంఘాల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన గంగుల మాట్లాడుతూ, ప్రమాదవశాత్తు ఏ కార్మికుడైనా చనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు బీమా సౌకర్యంతోపాటు ఇతర అవకాశాలను కల్పిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన పీఓపీ కార్మికులు 200 మందికి పైగా టీఆర్‌ఎస్‌లో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పారు. పార్టీలో చేరిన వారిలో పీఓపీ కార్మిక విభాగం అధ్యక్షుడు దినేశ్, అరుణ్, అఖిల్, తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక విభాగం నాయకుడు బొల్లంపల్లి ఐలయ్య, టీఆర్‌ఎస్ నాయకులు చల్ల హరిశంకర్, వై. సునీల్‌రావు, అలువాల రవీందర్, ఏవీ రమణ, శ్రీకాంత్, వేణు, తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles