నిరుపేదల సంక్షేమమే లక్ష్యం

Tue,July 23, 2019 01:07 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ/ కరీంనగర్ రూరల్: నిరుపేదల సంక్షేమమే రాష్ట్ర సర్కారు లక్ష్యమని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. దీనిలో భాగంగానే పేదల కోసం ప్రస్తుతం ఇస్తున్న ఆసరా పింఛన్‌ను పెంచి ఇస్తోందన్నారు. సోమవారం స్థానిక ఎన్‌ఎన్ గార్డెన్‌లో 6, 7, 8, 9 డివిజన్లకు సంబంధించిన లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వృద్ధులు, పేదలు ఆత్మగౌరవంగా బతకాలన్న ఆలోచనతోనే సీఎం కేసీఆర్ పింఛన్లను పెంచి ఇస్తున్నారని చెప్పారు. పేదల సంక్షేమం కోసం పని చేస్తున్న సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు దీవించాలని కోరారు. పింఛన్ల పంపిణీ విషయంలో బీజేపీ పార్టీ తప్పుడు ప్రచారం సాగిస్తున్నదని విమర్శించారు. పింఛన్లకు సంబంధించి 90 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నదని స్పష్టంచేశారు. కేంద్రం నుంచి మిగతా మొత్తం మాత్రమే ఇస్తున్నారని పేర్కొన్నారు. రైతులందరికీ సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్లు గుగ్గిళ్లపు రమేష్, షమీ, మాజీ కార్పొరేటర్లు ఉమారాణి, ఆరిఫ్, నాయకులు చల్ల హరిశంకర్, కుమార్, నరేందర్, శ్రీనివాస్, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

హామీ నెరవేర్చిన సీఎం కేసీఆర్..
పింఛన్లు పెంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చి మాట నిలుపుకున్నారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ మండలంలోని బొమ్మకల్ గ్రామం వద్ద ఉన్న ఓ ఫంక్షన్‌హాల్‌లో కరీంనగర్‌రూరల్ గ్రామాల్లోని వృద్ధులు, వికలాంగులకు పెంచిన పింఛను ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో ఏ పాలకులు కూడా వృద్ధులు, వికలాంగులను పట్టించుకోలేదనీ, వారు ఇచ్చే పింఛన్ ఏ మూలకూ సరిపోలేదన్నారు. ఇప్పుడు తాము పెద్ద మొత్తంలో పింఛన్ ఇచ్చి పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుంటే, అందులో తమ వాటానే అధికమంటూ పలువురు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 60 ఏళ్లకు పింఛన్ అందించాలనే కేంద్ర ప్రభుత్వ నిబంధనను తొలగించి, రాష్ట్రంలో 57 ఏళ్లకే వృద్ధులకు పింఛన్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పింఛన్లు పొందిన ప్రతి ఒక్కరూ ఇంట్లో ఆరు మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలన్నారు. అలాగే, సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, జడ్పీటీసీ పురుమల్ల లలిత, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్, తుల బాలయ్య, ఎంపీడీవో పవన్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, ఈవోపీఆర్డీ జగన్‌మోహన్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles