రేకుర్తిలో వరుణ్ మోటార్స్ షోరూం ప్రారంభం

Tue,July 23, 2019 01:06 AM

కరీంనగర్ హెల్త్: రేకుర్తిలో నూతనంగా ఏర్పాటు చేసిన వరుణ్ మోటార్స్‌కు చెందిన మారుతి సుజుకీ ఏరినా షో రూంను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి సోమవారం జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రారంభించారు. మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, కరీంనగర్‌లో ఏ షోరూం ప్రారంభించినా అది విజయవంతమవుతుందనీ, కొత్త షోరూం ప్రారంభం కావడంతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. కరీంనగర్ స్మార్ట్‌సిటీగా మారిన తర్వాతే పెద్ద పెద్ద సంస్థలు అయిన వరుణ్ మోటార్స్‌లాంటివి ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు. వరుణ్ మోటార్స్ చైర్మన్ వీ ప్రభుకిశోర్ మాట్లాడుతూ, తెలంగాణ, ఆంధ్ర, బెంగళూర్‌లలో 48 బ్రాంచీలు ఏర్పాటు చేశామనీ, కరీంనగర్‌లో 49వ షోరూం నెలకొల్పడం ఆనందంగా ఉందన్నారు. నూతన మోడల్స్ ఇప్పుడిప్పుడే అందుబాటులో ఉంచుతూ నాణ్యమైన సేవలు అందిస్తామన్నారు. ఇందులో మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, వరుణ్ మోటార్స్ కమర్షియల్ బిజినెస్ హెడ్ ఆశిష్‌జైన్, రీజినల్ మేనేజర్ అనింద్యదత్త, ఎండీ వరుణ్‌దేవ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీఆర్‌సీ రాజు, రూరల్ ఎంపీపీ లక్ష్మయ్య, మాజీ ఎంపీపీ రమేశ్, చల్ల హరిశంకర్, పిట్టల రవీందర్, సునీల్‌రావు, కట్ల సతీశ్, షోరూం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

69
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles