ఓటర్ల లెక్క తేలింది!

Wed,July 17, 2019 06:23 AM

బల్దియాల ఎన్నికల నేపథ్యంలో కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఓటర్ల లెక్క తేలింది. ఆయా చోట్ల యంత్రాంగం తుది జాబితాలను మంగళవారం విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల వారీగా అన్ని నగర, పురపాలక సంస్థల నోటీస్ బోర్డుల్లో ప్రదర్శించింది. ఫైనల్ లిస్ట్ ప్రకారం.. కరీంనగర్‌లో 2,57,786, హుజూరాబాద్‌లో 25,406, జమ్మికుంటలో 29,212, కొత్తపల్లిలో 9,421, చొప్పదండిలో 12,554 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. అయితే ఆలస్యం కావడంతో కరీంనగరంలో మాత్రం డివిజన్ల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల ఓటర్ల లెక్కను వెల్లడించలేకపోయింది.

(కార్పొరేషన్, నమస్తే తెలంగాణ):జిల్లాలోని కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన ఓటర్ల తుదిజాబితా కులాల వారీగా విడుదలైంది. కరీంనగర్‌లో ఇప్పటికే డివిజన్ల వారీగా ఓటరు జాబితాలను అన్ని రాజకీయ పార్టీలకు అందించారు. కాగా, ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం కరీంనగర్‌లో మొత్తం 2.56,866 ఓటర్లు ఉండగా, తుది జాబితాకు వచ్చే సరికి ఈ సంఖ్య 2,57,786 ఓట్లకు చేరుకుంది. కాగా, ఈ జాబితాను సోమవారం నగర కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, అధికారులు విడుదల చేశారు. అయితే పెరిగిన ఓటర్లు ఏయే డివిజన్లకు సంబంధించిన వారన్న విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. డివిజన్ల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల ఓట్ల సంఖ్య తేలితేనే ఏయే డివిజన్లల్లో ఈ ఓటర్లు సర్దుబాటు అయ్యారన్న విషయం తేలుతుంది. డివిజన్ల వారీగా ఓటరు జాబితాను ప్రకటించిన అధికారులు మహిళ, పురుష, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను ప్రకటించకపోవడంతో అంతటా ఆసక్తి నెలకొన్నది.

* కొత్తపల్లిలో 68 శాతం బీసీ ఓటర్లు..
కరీంనగర్‌రూరల్ : నూతనంగా ఏర్పాటైన కొత్తపల్లి మున్సిపాలిటీలో తుది ఓటరు జాబితాను కమిషనర్ స్వరూపరాణి విడుదల చేశారు. ఈ మున్సిపాలిటీల్లో మొత్తం ఓటర్లు 9421 మంది ఉండగా పురుష ఓటర్లు 4632, మహిళ ఓటర్లు 4789 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, వీరిలో బీసీ ఓటర్లు 6416 మంది కాగా, పురుషులు 3151 మంది, మహిళలు 3265 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే ఎస్టీలు మొత్తంగా 104 మంది కాగా, పురుషులు 50, మహిలు 54 మంది ఉన్నారు. ఎస్సీలు మొత్తం 1698 మంది ఉండగా, పురుషులు 841, మహిళలు 857 మంది ఉన్నారు.ఫోటోరైటప్‌ః11హెచ్‌జడ్‌బి16ఃఎఃఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ ఓటర్ల తుది జాబితాను నోటీస్‌బోర్డుపై అంటిస్తున్న కమిషనర్

హుజూరాబాద్‌లో..
హుజూరాబాద్‌టౌన్ : పట్టణంలోని 30 వార్డుల వారీగా ఓటర్ల జాబితాను మున్సిపల్ కమిషనర్ ఈసంపెల్లి జోన విడుదల చేశారు. ఈ మేరకు స్థానిక పురపాలక సంఘం, ఆర్డీవో కార్యాలయంలో నోటీస్ బోర్డులపై అంటించారు. ఎస్టీలు పురుషులు 108, మహిళలు 126 మంది, ఎస్సీలు పురుషులు 2210 మంది, మహిళలు 2373, బీసీలు పురుషులు 8168, మహిళలు 8168, ఓసీలు పురుషులు 2204, మహిళలు 2080 మంది ఉన్నారు. మొత్తం 12659 మంది పురుషులు, 12747 మంది మహిళలు కాగా, మొత్తం 25,406 మంది ఓటర్లు ఉన్నారు.

జమ్మికుంటలో..
జమ్మికుంట రూరల్ : జమ్మికుంట పురపాలక సంఘానికి సంబంధించిన ఓటరు తుది జాబితాను మున్సిపల్ కమిషనర్ రషీద్ విడుదల చేశారు. మొత్తం 30 వార్డులు కాగా, 29212 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్సీలు 5730 కాగా, మహిళలు 2890, పురుషులు 2840 మంది ఉన్నారు. ఎస్టీలు 211 కాగా, మహిళలు 99, పురుషులు 112 ఉన్నారు. బీసీలు 19017 కాగా, మహిళలు 9600, పురుషులు 9417 మంది ఉన్నారు. ఓసీలు మొత్తం 4254 కాగా, మహిళలు 2077, పురుషులు 2177 మంది ఉన్నారు. మొత్తంగా మహిళలు 14666, పురుషులు 14546 ఉన్నారు.

06సీపీడీ16ఃఓటరుజాబితా ప్రదర్శిస్తున్న కమిషనర్ రాజేందర్‌కుమార్
చొప్పదండిలో..
చొప్పదండి,నమస్తేతెలంగాణ : చొప్పదండి మున్సిపల్ పరిధిలోని ఓటర్ల జాబితాను మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌కుమార్ విడుదల చేశారు. మొత్తం 14 వార్డుల్లో 12,554 మంది ఓటర్లు కాగా, పురుషులు 6248, మహిళలు 6296 మంది ఉన్నారు. అందులో ఎస్సీలు 2166, ఎస్టీలు 75 మంది, బీసీలు 9086 మంది, ఓసీలు 1227 మంది ఉన్నారు.

78
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles