ఇదిగో ఓటరు జాబితా

Thu,July 11, 2019 01:48 AM

(కార్పొరేషన్, నమస్తే తెలంగాణ) మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లలో భాగంగా బుధవారం నగరపాలక అధికారులు డివిజన్లవారీగా ఫొటోలతో కూడిన ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటించారు. వీటితోపాటు డివిజన్లవారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాను కూడా విడుదల చేశారు. దీంతో నాయకుల్లో ఏ డివిజన్ ఎలా రిజర్వేషన్ అవుతుందన్న విషయంలో ఆసక్తి నెలకొంది. అధికారులు డివిజన్లవారీగా ఓటరు జాబితా విడుదల చేయడంతో ఆశావహులు లెక్కలు వేసే పనిలో పడ్డారు. నగరంలో మొత్తంగా 2,56,866 ఓటర్లు ఉండగా వీరిలో 1,29,273 మంది పురుష ఓటర్లు, 1,27,572 మహిళా ఓటర్లున్నారు. మొత్తం ఓటర్లలో 1,51,998 బీసీ ఓటర్లు ఉండగా, వీరిలో 76,294 మంది మహిళా ఓటర్లు, 75,705 మంది పురుష ఓటర్లున్నారు. అలాగే, 2,699 మంది ఎస్టీ ఓటర్లుండగా.. వీరిలో 1416 పురుషులు, 1283 మహిళా ఓటర్లున్నారు. 22,712 మంది ఎస్సీ ఓటర్లుండగా వీరిలో 11,662 మంది మహిళా ఓటర్లు, 11,050 మంది పురుష ఓటర్లు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. నగరపాలక అధికారులు ప్రకటించిన ఓటర్ల ముసాయిదా జాబితాను అనుసరించి ఎస్సీలు అధికంగా 57వ డివిజన్‌లో (1890 మంది ఓటర్లు ), 51లో (1712), 2లో (1424), 4లో (1306), 9లో (1285), 10లో (1211), 11లో ( 1005), 12 (1001)లో ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వం అందించే రిజర్వేషన్ శాతాన్ని అనుసరించి వీటిల్లో అత్యధికంగా ఉన్న డివిజన్లు ఎస్సీలకు రిజర్వేషన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే, బీసీలు అధికంగా 41వ డివిజన్‌లో 4,200, 27లో 4,136 మంది, 40లో 3,788, 18లో 3,591, 39లో 3,584, 60లో 3,530, 34లో 3,570, 7లో 3,361, 16లో 3,280, 23లో 3,241, 29లో 3,229, 32లో 3,202, 8లో 3,217, 28లో 3,199 మంది బీసీ ఓటర్లున్నారు. ఎస్టీకి సంబంధించి 3వ డివిజన్‌లో 398 మంది, 39వ డివిజన్‌లో 254 మంది, 51లో 180 మంది, 40లో 153 మంది ఓటర్లున్నారు.

నేడు అఖిలపక్ష సమావేశం..
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నగరపాలక అధికారులు బుధవారం ఓటర్ల జాబితాను ప్రకటించారు. దీనిపై గురువారం ఉదయం 10.30 గంటలకు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీలతో అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు నగర కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయా రాజకీయ పార్టీలకు సమాచారం అందించారు.

80
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles