అభివృద్ధి పనులను వేగవంతం చేస్తాం

Sun,July 7, 2019 01:01 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌లో చేపడుతున్న అభివృద్ధి పనులన్నింటినీ వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. శనివారం నగరంలోని 27వ డివిజన్‌లో పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.350 కోట్ల నిధులు వచ్చినా పనులు చేసే విషయంలో ఆలస్యం జరిగిందన్నారు. కాంట్రాక్టర్లు పనులు చేయకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకుని వేగంగా పనులు చేయిస్తామన్నారు. వచ్చే ఎన్నికలకు ముందే ఈ పనులన్నీ పూర్తయ్యేలా చూస్తామన్నారు. అభివృద్ధి పనులకు ప్రజలు కూడా సహకారం అందించాలని కోరారు. కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ నగరంలో సాగుతున్న అభివృద్ధి పనులపై పూర్తిస్థాయి పర్యవేక్షణ చేస్తామన్నారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుని పనుల్లో వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొడూరి రవీందర్‌గౌడ్, వై సునీల్‌రావు, నాయకులు చల్ల హరిశంకర్, తోట మధు, సంతోష్, నగరపాలక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన విద్య అందించేందుకు కృషి
రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఎంతో మంది మేధావులు, రాజకీయ నాయకులు, అధికారులు ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుని ఈ స్థాయికి వచ్చిన వారేనని గుర్తు చేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు సునీల్‌రావు, హరిశంకర్, రమణ, శ్రీధర్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

107
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles