విజయవంతం చేయాలి

Thu,June 20, 2019 01:47 AM

తెలంగాణ చౌక్: కరీంనగర్ పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు యోగా దినోత్సవ కమిటీ నోడల్ అధికారి డాక్టర్ సంయుక్తరాణి, పతంజలి యోగా సమితి కో-ఆర్డినేటర్ డాక్టర్ ముత్యాల రమేశ్ తెలిపారు. స్థానిక ప్రెస్‌భవన్‌లో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు మాన్ యోగా కార్యక్రమం ఉంటుందన్నారు. ఈకార్యక్రమానికి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, నెహ్రు యువకే్రందం, యువభారత్, బ్రహ్మకుమారీ, లయన్స్ క్లబ్, రామచంద్ర మిషన్, కరీంనగర్ యోగా అసోసియేషన్, వివిధ పాఠశాలలు, యోగా సాధకులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో అంతర్జాతీయ యోగా కమిటీ కన్వీనర్ డాక్టర్ రజిత, యువభారత్ జిల్లా అధ్యక్షుడు కొండ లక్ష్మణ్‌బాబు, పతంజలి యోగా సమితి జిల్లా అధ్యక్షుడు బి. లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

81
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles