ఒలింపిక్ డే రన్‌కు సర్వం సిద్ధం

Thu,June 20, 2019 01:46 AM

కరీంనగర్ స్పోర్ట్స్: నగరంలో ఈనెల 20న జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఒలింపిక్ డే రన్ 2019కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్ధన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్‌రెడ్డి తెలిపారు. అంబేద్కర్ స్టేడియంలో చేపడుతున్న ఏర్పాట్లను బుధవారం సాయంత్రం వారు ఇన్‌చార్జి డీవైఎస్‌ఓ ఎన్ సిద్దారెడ్డితో కలిసి పరిశీలించి, పలు సూచనలు చేశారు. గురువారం ఉదయం 8 గంటలకు అంబేద్కర్ స్టేడియం వద్ద ఒలింపిక్ రన్‌ను కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, సీపీ కమలాసన్‌రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. రన్ భగత్‌సింగ్ విగ్రహం, కలెక్టరేట్, ప్రతిమ మల్టీప్లెక్స్ గుండా తెలంగాణచౌక్ వరకు కొనసాగుతుందన్నారు. ఇందులో జిల్లాలోని క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు, పెటా సంఘాల బాధ్యులు, పీఈటీ, పీడీలు, స్వచ్ఛంద, యువజన సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొంటారని వెల్లడించారు.

74
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles