యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

Thu,June 20, 2019 01:46 AM

-జేసీ శ్యాంప్రసాద్‌లాల్
-యోగా వాక్ ప్రారంభం
కరీంనగర్ స్పోర్ట్స్: ప్రతి ఒక్కరూ యోగా దినచర్యలో భాగంగా చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని జేసీ జీవీ శ్యాంప్రసాద్‌లాల్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఆయుష్‌శాఖ, పతంజలి యోగా సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నగరంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే మైదానం నుంచి చేపట్టిన యోగా వాక్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు యోగా చేయాలన్నారు. నిరంతరం యోగా చేయడంతో వ్యాధులు రావని సూచించారు. ప్రాణాయామంతో జీవనశైలి మారి వ్యాధులు రాకుండా నివారించుకోవచ్చన్నారు. జ్యోతిబాఫూలే మైదానం నుంచి ప్రారంభమైన యోగా వాక్ నగరంలోని పలు వీధుల గుండా అంబేద్కర్ స్టేడియంకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో యోగా కమిటీ నోడల్ అధికారి డాక్టర్ సంయుక్తరాణి, డిప్యూటీ నోడల్ అధికారి డా.రవికుమార్, కన్వీనర్ డా. రజిత, కో-కన్వీనర్ డా.శ్రీదేవి, సీనియర్ ఆయుష్ వైద్యుడు పీవీ వేణుగోపాల్‌రావు, సుల్తానా, ఆయుష్ వైద్యులు శశిప్రభ, సంధ్య, శ్రీవాణి, శ్రీదేవి, రవీందర్‌రావు, సంధ్య, పతంజలి యోగా సమితి ప్రతినిధులు ఎం రమేశ్, ఎన్‌వైకే బి రవీందర్, ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణ, కె లక్ష్మణ్‌బాబు, రాజేందర్, రాజేశ్వర్, అన్వర్, మునీర్, సుధాకర్, అనిల్, విజేందర్, తదితరులు పాల్గొన్నారు.

95
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles