ఆడబిడ్డలకు సర్కారు అండ

Thu,June 20, 2019 01:46 AM

-ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
- కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత
మానకొండూర్: ఆడబిడ్డలకు తెలంగాణ సర్కారు అండగా ఉంటూ, కంటికి రెప్పలా కాపాడుకుంటుందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మండలంలోని 95 మంది లబ్ధిదారులకు రూ.95లక్షల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఆడబిడ్డల పెళ్లికి ఆర్థిక సాయం అందించిన దాఖలాలు లేవన్నారు. గతంలో ఆడబిడ్డల పెళ్లికి ఆస్తులు అమ్ముకొని, అప్పులు చేసిన తల్లిదండ్రులు ఉన్నారని గుర్తు చేశారు. ఆడపిల్ల పుడితే అయ్యో అని బాధపడే రోజులు పోయాయనీ, ఇప్పుడు అదృష్టలక్ష్మి పుట్టిందనే భరోసా ప్రభుత్వం కల్పించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే పుట్టిన పసిపాప నుంచి వృద్ధాప్యంలోని పండు ముదుసలి వరకు మహిళలకు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు.ఎంపీపీ మాతంగి లింగయ్య, జడ్పీటీసీలు ఎడ్ల సుగుణాకర్, తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, తాసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ దేవదాస్, నాయబ్ తాసిల్దార్ కిరణ్‌రెడ్డి, సర్పంచులు దేవ సతీష్‌రెడ్డి, పోల్సాని మురళీధర్‌రావు, రొడ్డ పృథ్వీరాజ్, రామంచ గోపాల్‌రెడ్డి, సుదర్శన్, బొట్ల కిషన్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

83
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles