మచ్చలేని నాయకుడు ఈటల

Wed,June 19, 2019 02:03 AM

వీణవంక: బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతిగా పేరుగాంచి, పేద విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తున్న మచ్చలేని నాయకుడు ఈటల రాజేందర్‌ అని టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మారముల్ల కొమురయ్య అన్నారు. సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు మంత్రి దిష్టిబొమ్మను దహనం చేయడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలోని బస్టాండ్‌ ఆవరణలో మంగళవారం టీఆర్‌ఎస్‌, టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే ఈటల విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కెజీబీవీ, ఆదర్శ పాఠశాలను మండలానికి తీసుకువచ్చాడని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సీఎం కేసీఆర్‌తోపాటు, ఈట ల ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, సంక్షేమ హాస్టళ్ల బాగోగులపై శ్రద్ధ వహించారన్నారు. ఈటలను విమర్శిం చే, దిష్టిబొమ్మను దహనం చేసే నీచ కార్యాలకు విద్యార్థి సంఘాల నాయకులు పాల్పడడం సిగ్గుచేటన్నారు. ఈటల చొరవతోనే విద్యార్థులకు కార్పొరేట్‌ సౌకర్యాలతోపాటు నాణ్యమైన విద్య అందుతున్నదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్‌చైర్మన్‌ పెద్ది మల్లారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎల్లారెడ్డి, కో ఆప్షన్‌ సభ్యుడు ఎంఏ హమీద్‌, టీఆర్‌ఎస్వీ నియోజకవర్గ ఇన్‌చార్జి సునీల్‌, మండలాధ్యక్షుడు అఖిల్‌గౌడ్‌, నాయకులు రాయిశెట్టి లత-శ్రీనివాస్‌, మర్రి స్వామి, మ్యాక వీరయ్య, పత్తి కొండాల్‌రెడ్డి, దాసారపు రాజు, వెంకటేశ్వర్లు, లచ్చయ్య, మోరె స్వామి, కుమార్‌, అనిల్‌రెడ్డి పాల్గొన్నారు.

95
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles