అన్ని కాలనీల్లో సీసీ రోడ్లు నిర్మిస్తాం

Wed,June 19, 2019 02:03 AM

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: నగరంలోని అన్ని కాలనీల్లో సీసీ రోడ్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఉద్ఘా టించారు. మంగళవారం 32వ డివిజన్‌లో రూ. 2 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధ్ది పనులను ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడోసారి గెలుపుతో తనపై మరింత బాధ్య త పెరిగిందన్నారు. గత పాలకులు శివారు కాలనీలను నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీగా నిధులు మంజూ రు చేసిందని తెలిపారు. సప్తగిరి, జానకీ కాలనీల్లో అన్ని సీసీ రోడ్లుగా మార్చుతామన్నారు. గతంలో అన్ని డివిజన్లల్లోనూ మట్టి రోడ్లు కనిపించేవన్నారు. గత ప్రభుత్వాలు మున్సిపాలిటీలకు ప్రజలు కట్టే పన్నులతోనే పనులు చేపట్టేవనీ, కాని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా రాష్ట్ర బడ్జెట్‌ నుంచి నిధులు కేటాయించిందని గుర్తు చే శారు. యేటా రూ. 100 కోట్ల నిధులు ఇ స్తుందన్నారు. ఎన్నికల కోడ్‌ మూలంగా ప నులు నిలిచిపోయాయనీ, కానీ ఇప్పుడు వేగం పెంచుతామన్నారు. కాంట్రాక్టర్లు నా ణ్యత పాటించాలని సూచించారు. అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజ లు సైతం పనుల పురోగతిపై దృష్టిపెట్టాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ ఏవీ రమణ, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
అన్ని రహదారులను అభివృద్ధి చేస్తాం..
నగర శివారులోని ఆటోనగర్‌లో డీఎంఎఫ్‌టీ నిధులు రూ. 32 లక్షలతో చేపడుతున్న అభివృద్ధ్ది పనులను ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మంగళవారం ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిధులు మంజూరు చేసి పనులు చేపడుతున్నామని చెప్పారు. రోడ్డుకు ఇరువైపుల మురుగు కాల్వలు నిర్మించా లనీ, డ్రైన్‌ టు డ్రైన్‌ రోడ్డు వేయాలన్నారు. రోడ్డు విస్తరణ ప నులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎంపీపీ వాసాల రమేశ్‌, నాయకులు సంపత్‌రావు, రాజేశ్వర్‌రావు, తుల బాలయ్య పాల్గొన్నారు.

104
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles