‘కాళేశ్వరం’తో కష్టాలు దూరం

Tue,June 18, 2019 01:26 AM

- నెరవేరనున్న సీఎం కేసీఆర్‌ చిరకాల స్వప్నం
- సస్యశ్యామలం కానున్న తెలంగాణ
- రామడుగు మండలం కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర బిందువు
- చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌
- లక్ష్మీపూర్‌ ఎనిమిదో ప్యాకేజీ సందర్శన
రామడుగు ః తెలంగాణ సర్కారు గోదావరి నదిపై అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్ర ప్రజల కష్టాలు తీరనున్నాయని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని కాళేశ్వరం ఎనిమిదో ప్యాకేజీని సోమవారం ఉదయం పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు. దీనిలో భాగంగా కాన్ఫరెన్స్‌హాల్‌లో ప్రాజెక్టు డీఈఈ గోపాలకృష్ణ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి వివరాలను మ్యాపుల ద్వారా వివరించారు. అనంతరం డెలివరీ సిస్టర్న్‌ చేరుకున్న ఎమ్మెల్యే సుమారు 150 మీటర్ల లోతులోంచి నీరువచ్చే విధానాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి గ్రావిటీ కాలువవెంట రామడుగు, చిప్పకుర్తి గ్రామాల మధ్య ఉన్న వంతెన వద్దకు చేరుకొని శ్రీరాములపల్లి సమీపంలోని వరదకాలువకు గ్రావిటీ కాలువ అనుసంధానమైన చోట పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మరికొన్ని రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిరకాల స్వప్నం నెరవేరకుందన్నారు. రాష్ట్రంలో ఖమ్మం జిల్లా తప్ప అన్ని జిల్లాల్లోని లక్షల ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న సీఎం ప్రారరంభించనున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ రాష్ట్ర సస్యశ్యామలం కానుందన్నారు. ముఖ్యంగా గోదారమ్మ ముందుగా చొప్పదండి నియోజకవర్గంలో ఉరకలేయనుందన్నారు. ప్రాజెక్టు మొత్తానికి రామడుగు మండలం కేంద్ర బిందువు కానుందన్నారు. ఎనిమిదో ప్యాకేజీ ద్వారా మండలంలోని శ్రీరాములపల్లి సమీపంలో వరదకాలువకు కాళేశ్వరం గ్రావిటీ కాలువను అనుసంధానించడం జరిగిందన్నారు.

రోజుకు రెండు టీఎంసీల నీటిని సుమారు తొంబై రోజుల పాటు మధ్య మానేరు ద్వారా రాష్ట్రమంతా సరఫరా చేయనున్నారన్నారు. మరో వైపు శ్రీరాంసాగర్‌ పునర్జీవన పథకంలో భాగంగా వరదకాలువ ద్వారా రివర్స్‌ పంపింగ్‌తో పోచంపాడుకు నీటిని తీసుకెళ్ళి తిరిగి కాలువల ద్వారా మళ్ళీ రైతులకు అందించనున్నారని తెలిపారు. కాళేశ్వరం నీటిని నెలల తరబడి తరలించనున్నారు కావున రామడుగు మండలంలోని వరదకాలువలో నిత్యం నీరుంటుందన్నారు. రామడుగు, గంగాధర, చొప్పదండి మండలాల రైతులు, ప్రజల తాగు, సీగునీటి సమస్య తీర్చేందుకు వరదకాలువపై నాలుగుచోట్ల తూములను ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. మోతె ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా వరదకాలువకు తూములను నిర్మించడానికి 271 కోట్లతో టెండర్లు పూర్తి చేసుకొని పదిహేను రోజుల్లో పనుల నిర్మాణం జరుగనుందన్నారు. కాగా టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు జోగినపల్లి రవీందర్‌రావు ఎనిమిదో ప్యాకేజీ చేరుకొని అధికారులతో కలిసి అండర్‌ గ్రౌండ్‌ టన్నెల్‌ జంక్షన్‌ పాయింట్‌, సర్వీస్‌బే, సర్జిఫూల్‌, పంపుహౌజ్‌, డెలివరీ సిస్టర్న్‌ పరిశీలించారు. ఇక్కడ జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, రామడుగు, గంగాధర మండలాల ఎంపీపీలు మార్కొండ కిష్టారెడ్డి, దూలం బాలగౌడ్‌, కొత్తగా ఎంపికైన ఎంపీపీ శ్రీరాం మధూకర్‌, చొప్పదండి జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, సర్పంచు జవ్వాజి శేఖర్‌, కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్‌ తిర్మల్‌రావు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ముదుగంటి సురేందర్‌రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టు డీఈఈ గోపాలకృష్ణ, ఏఈఈలు శ్రీనివాస్‌, రమేష నాయక్‌, వేంకటేష్‌, తదితరులు ఉన్నారు.

79
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles