కార్పొరేట్‌కు ధీటుగా గురుకులాలు

Tue,June 18, 2019 01:15 AM

- పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
- విద్యాలయాలకు నిలయంగా హుజూరాబాద్‌
- రాబోయే రోజుల్లో మరిన్ని నెలకొల్పుతాం
- కులమతాలకతీతంగా ప్రతీ విద్యార్థికి చోటు
- గురుకుల పాఠశాల ప్రారంభోత్సవంలో మంత్రి ఈటల
హుజూరాబాద్‌,నమస్తే తెలంగాణః కార్పోరేట్‌కు ధీటుగా రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలను నెలకొల్పుతుందని రాష్ట్ర వైద్య అరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. సోమవారం పట్టణ సమీపంలో మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలను మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్‌ నియోజవర్గాన్ని విద్యాలయాలకు నిలయంగా చేయడమే లక్ష్యమని, దీని కోసం ఇప్పటికే కమలాపూర్‌, జమ్మికుంట, హుజూరాబాద్‌,వీణవంక మండలాల్లో కస్తూర్బా, మహాత్మ జ్యోతీబాపూలే, మైనార్టీ పాఠశాలలను నెలకొల్పామని చెప్పారు. వీణవంకలో బీసీ బాలుర, బాలికల పాఠశాలలు తప్పకుండా ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు. రాష్ట్ర మొత్తం మీద దాదాపు 7వందల గురుకులాలను ఇప్పటికే ఏర్పాటు చేశామని, రాబోయే రోజుల్లో మరిన్ని నెలకొల్పుతామన్నారు. పేద తల్లిదండ్రులకు విద్య పేరిట భారం పడకుండా ఉండేందుకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విదేశాల్లో ఉన్నత చదువుకోసం ప్రభుత్వమే పేద విద్యార్థులకు రూ 20లక్షలు అందిస్తుందన్నారు. అనుకోని ఆపదరూపంలో వచ్చే వైద్య ఖర్చులతో చిన్న చితక కుటుంబాలు అర్థికంగా చితికి పోతున్నాయని, వారి కోసం ప్రభుత్వం అసుపత్రుల్లో మెరుగైన చికిత్స అందించేందుకు ఎన్నో రకాల చర్యలు తీసుకుందన్నారు. నియోజవర్గం ప్రజలకు అండగా ఎల్లవేళలా ఉంటానని, అపదలో ఉన్నా వారిని అదుకునేందుకు తన ఇంటి తలపులు ఎప్పుడు తెరచే ఉంచుతాయని భరోసానిచ్చారు.ఈ సందర్బంగా ఆయన పలువురి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేశారు. కస్తూర్బా విద్యార్థులు చేసిన నృత్యాలు అకట్టుకున్నాయి. కాగా పాఠశాలలో మొత్తం 240 సీట్లు ఉండగా ఇప్పటికే నిండుకున్నాయని ఇంచార్జీ ప్రిన్సిపాల్‌ రాజమౌళి తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు పడిదం బక్కారెడ్డి, శ్రీరాం శ్యాం, మున్సిపాల్‌ చైర్మన్‌ మంద ఉమాదేవి-రమేష్‌, నాయకులు గోపు కొమురారెడ్డి, ఇరుమల్ల సురేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, ప్రిన్సిపాల్‌ నరసింహారెడ్డితో పాటు తదితరులు ఉన్నారు.

83
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles