పీఆర్‌సీని అమలు చేయాలి: డీటీఎఫ్

Mon,June 17, 2019 01:23 AM

హౌసింగ్‌బోర్డుకాలనీ: ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ 2018 జూలై 1 నుంచి పీఆర్‌సీని తక్షణమే అమలు చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఎం రఘుశంకర్‌రెడ్డి కోరారు. ఆదివారం స్థానిక ఆ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగానికి బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించాలని, బడుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీ రాజిరెడ్డి మాట్లాడుతూ పాఠశాల విద్యారంగంలో అనేక పర్యవేక్షక, ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలుగా ఉన్నాయనీ, వీటిని వెంటనే భర్తీ చేయాలని కోరారు. హెల్త్ కార్డులతో వైద్య సేవలు సక్రమంగా అందేలా చూడాలన్నారు. భాషా పండితులు, పీఈటీల అప్‌గ్రేడేషన్ చేసి, అర్హులకు ప్రమోషన్ ఇచ్చి, బదిలీలు చేపట్టాలని కోరారు. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు పల్కల ఈశ్వర్‌రెడ్డి అధ్యక్షత వహించగా, జిల్లా ప్రధాన కార్యదర్శి కోహెడ చంద్రమౌళి సంఘం కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు కే నారాయణరెడ్డి, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ ఏసురెడ్డి, అధ్యాపకజ్వాల సంపాదకుడు ఏ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా బాధ్యులు టీ తిరుపతి, వై ఉమారాణి, ఏ సంతోష్‌రెడ్డి, ఈ వెంకట్రాములు, సీహెచ్ జనార్దన్, రాష్ట్ర కౌన్సిలర్‌లు కే కిషన్‌రెడ్డి, సీహెచ్ రవీంద్రకుమార్, టీ తిరుపతిగౌడ్, ఎస్ ఈశ్వరయ్య, సీహెచ్ రామ్మోహన్, బీవీ ప్రవీణ్‌కుమార్, వీ రత్నం, తదితరులు పాల్గొన్నారు.

ఐఆర్ ప్రకటించాలి: పీఆర్‌టీయూ టీఎస్
హౌసింగ్‌బోర్డుకాలనీ: ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ 2018 జూలై 1 నుంచి మధ్యంతర భృతి(ఐఆర్) 43 శాతం వర్తించేలా తక్షణమే ప్రకటించాలని పీఆర్‌టీయూ తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం చెన్నయ్య కోరారు. ఆదివారం స్థానిక ఆ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై చర్చించారు. బడిబాట కార్యక్రమం అనంతరం విద్యార్థుల నమోదు ప్రాతిపదికగా వర్క్ అడ్జెస్టు పేరిట ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టాలని, సీపీఎస్ రద్దు, ప్రాథమిక పాఠశాలల బలోపేతం కోసం తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉన్న ప్రతి పాఠశాలలకు హెచ్‌ఎం పోస్టు కేటాయించాలని, టీఆర్టీ నియామకాలు చేపట్టాలని, ఉద్యోగ విరమణ వయసు 58 నుంచి 61కి పెంచాలని, 398 స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్‌లు ప్రకటించాలని ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చొల్లేటి శ్రీనివాస్, కేతిరి తిరుపతిరెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పాతూరి రాజిరెడ్డి, బీ అనంతరావు, గోనె శ్రీనివాస్, పల్లెపాటి వేణుగోపాల్‌రావు, వీ వెంకటస్వామి, కే సత్యనారాయణరెడ్డి, ఎన్ రాంరెడ్డి, జీ శ్రీనివాస్, పులిపాక కిషన్, పంపయ్య, మహేశ్, బొల్గం శ్రీను, శ్రీధర్, జయేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

69
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles