రైతు చేతుల్లోకి పెట్టుబడి

Sun,June 16, 2019 01:36 AM

-శరవేగంగా ‘రైతుబంధు’ పంపిణీ
-ఖాతాల్లో జమవుతున్న నగదు
-1,61,635 మందికి రూ.171.65 కోట్లు మంజూరు
-ఇప్పటికే 42,512 మంది ఖాతాల్లోకి రూ.42.52 కోట్ల నగదు బదిలీ
(కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ)
రైతుబంధు కింద అర్హులైన వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. వారం కింద జిల్లాలో పట్టాదారు పాసు పుస్తకాలు అందిన రైతులు 1,58,383 మంది ఉండగా రూ.169 కోట్లా 33 లక్షలా 75 వేలా 774 మంజూరు చేశారు. ఇందులో 68,824 ఖాతాలు అప్డేట్‌ చేశారు. వీరిలో 15,233 మంది రైతులకు సంబంధించిన ఖాతాల్లో రూ.15 కోట్లా 62 లక్షలా 14 వేలా 335ల నగదు బదిలీ చేశారు. శనివారం వ్యవసాయ అధికారులు అందించిన వివరాల ప్రకారం చూస్తే పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతుల సంఖ్య 1,61,653 మందికి పెరిగింది. దీంతో రూ.171 కోట్లా 65 లక్షలా 48 వేలా 439 మంజూరు చేశారు. ఇందులో 1,35,225 మంది రైతుల ఖాతాలు అప్డేట్‌ చేశారు. 1,02,501 మంది వివరాలు ట్రెజరీకి పంపించారు. వీరిలో ఇప్పటి వరకు 42,512 మంది రైతుల ఖాతాల్లో రూ.42 కోట్లా 52 లక్షలా 65 వేలా 832ల నగదు బదిలీ చేశారు. వారంలో జిల్లాలో 3,270 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించగా రూ.2 కోట్లా 31 లక్షల 72 వేల 665 రైతుబంధు నగదు పెరిగింది. వారంలో 66,401 మంది ఖాతాలు అప్డేట్‌ కాగా. 27,279 మందికి రూ.26 కోట్లా 90 లక్షలా 50 వేలా 997లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

పెరుగుతున్న అర్హుల సంఖ్య
గడచిన రెండు సీజన్లకు ఎకరాకు రూ.4 వేల చొప్పున అందించగా ఈసారి రూ.5 వేలకు పెంచిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాకు అదనపు ప్రయోజనం జరుగుతోంది. అయితే నిరుటి రెండు సీజన్ల కంటే ఈసారి ఎక్కువ మంది రైతులు రైతుబంధుకు అర్హత సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2018 వానాకాలంలో 1,45,245 మందికి రూ.124 కోట్లా 58 లక్షలా 85 వేలా 100లు చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. యాసంగి సీజన్‌లో 1,48,759 మందికి రూ.130 కోట్లా 56 లక్షలా 70 వేలా 350లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈసారి ఇప్పటికే 1,61,653 మంది రైతులకు రూ.171 కోట్లా 65 లక్షలా 48 వేలా 439లు మంజూరయ్యాయి. మొదటి సీజన్‌కు ఇప్పటికి 16,408 మంది రైతులు పెరిగారు. రెవెన్యూ శాఖ పట్టాదారు పాసు పుస్తకాలు ఏ విధంగా అందిస్తే అదే విధంగా రైతుబంధు కింద రైతులకు పెట్టుబడి సహాయం అందుతోంది. నగదు విషయానికి వస్తే ఇప్పటి వరకు రూ.47 కోట్లా 6 లక్షలా 63 వేలా 339 పెరిగింది. ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచడంతో రైతులకు అదనపు ప్రయోజనం దక్కుతోంది. ఈ నేపథ్యంలోనే జిల్లాకు వచ్చే నగదు విలువ పెరిగినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుత సీజన్‌లో ఈ నెల 10 వరకు పట్టాదారు పాసు పుస్తకాలు అందిన రైతులకు మాత్రమే రైతుబంధు వర్తిస్తుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జిల్లాలో పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన 1,61,653 మంది రైతుల వరకే ఈ ప్రయోజనం దక్కే అవకాశాలు ఉన్నాయి.

వర్షాలు కురియక ముందే..
ఇప్పటికే వానాకాలం సీజన్‌ ప్రారంభం కావాల్సి ఉండగా వర్షాలు అనుకూలించని కారణంగా ఎక్కడా కూడా రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించ లేదు. వర్షాలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఆలోగా రైతులందరికీ రైతుబంధు ప్రయోజనం దక్కేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. గత నెల 27 వరకు ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున రైతుబంధు ప్రయోజనం రైతుల ఖాతాల్లో జమచేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సీజన్‌లో విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసుకునేందుకు రైతులకు తగిన సమయంలో పెట్టుబడికి నగదు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని శరవేగంగా అమలు చేస్తోంది. రాష్ట్ర స్థాయి నుంచే ఈ పథకాన్ని పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో రోజుకు కొంత మంది రైతుల ఖాతాలను అప్డేట్‌ చేసేందుకు ఏఈఓలు, మండల వ్యవసాయ అధికారులకు లక్ష్యాలు విధిస్తోంది. ఏరోజుకారోజు లక్ష్యాలను అధికారులు ఎప్పటికప్పుడు అప్డేట్‌ చేస్తున్నారు. రోజు రోజుకూ రాష్ట్ర అధికారులు రైతుల సంఖ్యను పెంచుతూ పోతున్నారు. వర్షాలు కురిసే సమయానికి ప్రతి ఒక్క రైతుకు ఈ పథకం ప్రయోజనం దక్కాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది.
ఖాతాలు మారితే వివరాలు ఇవ్వండి..
అర్హులైన ప్రతి రైతుకూ రైతుబంధు అందుతుంది. రైతుల ఖాతాల్లో నగదు జమైన వెంటనే వారి సెల్‌ ఫోన్లకు సంక్షిప్త సమాచారం (మెస్సేజ్‌) వస్తుంది. ఒక వేళ రాకుంటే రైతులు తమ బ్యాంకు ఖాతాలను అప్డేట్‌ చేసుకుంటే వివరాలు తెలిసి పోతాయి. రైతులు ఖాతాలు మార్చుకుంటే సంబంధిత వివరాలు వెంటనే గ్రామ స్థాయిలో ఉండే వ్యవసాయ విస్తరణ అధికారులకుగానీ మండల వ్యవసాయ అధికారులకుగానీ అందించాలి. ఆ ఖాతాల్లో రైతుబంధు నగదు జమచేస్తారు.
- వాసిరెడ్డి శ్రీధర్‌, జిల్లా వ్యవసాయ అధికారి

96
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles