ప్రవేశాలకు పోటీ పడేలా బడులను అభివృద్ధి చేస్తాం

Sun,June 16, 2019 01:35 AM

-కొత్త భవన నిర్మాణాలు చేపడుతాం
-ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయిస్తాం
-కోతిరాంపూర్‌ పాఠశాల ఆకస్మిక సందర్శనలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌
కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: రానున్న రోజుల్లో సర్కారు బడుల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు పోటీ పడేలా ప్రభుత్వం వాటిని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టిందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ తెలిపారు. శనివారం స్థానిక కోతిరాంపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని సౌకర్యాలు, భవనాలను పరిశీలించారు. మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, మధ్యాహ్న భోజనం నిర్వహణపై వివరాలను తెలుసుకున్నారు. ఎలాంటి బియ్యం వాడుతున్నారు.. కూరలు ఎలా ఉంటున్నాయని ఆరా తీశారు. విద్యార్థుల సమస్యలనూ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందిస్తున్నారని పేర్కొన్నారు. వీటితో పాటుగా ఆహ్లాద వాతావరణంలో చదువులు కొనసాగించేలా చూస్తామన్నారు. కోతిరాంపూర్‌లోని పాఠశాలలో ఉన్న గుట్టను తొలగించటంతో పాటుగా, శిథిలావస్థకు చేరిన భవనాన్ని కూల్చి కొత్త నిర్మాణాలను వేగంగా చేపడుతామన్నారు. దీనికి సంబందించి సీఎం కేసీఆర్‌ నుంచి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడాన్ని చిన్న తనంగా భావించవద్దనీ, ప్రస్తుతం సమాజంలో మంచి స్థానాల్లో ఉన్నవారందరూ కూడ సర్కారు బడుల్లో చదివి వచ్చిన వారేనని విద్యార్థులకు తెలిపారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాల కోసం ప్రజాప్రతినిధులతో సిఫారస్సులు చేయించే వారనీ, అలాంటి పరిస్థితులు తిరిగి తీసుకువచ్చేలా పని చేస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు ఐలయ్యయాదవ్‌, కర్రె రాజు, సూర్యశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

89
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles