క్రీడలతో మానసికోల్లాసం

Thu,June 13, 2019 01:30 AM

- వీణవంక ఎస్‌ఐ కృష్ణారెడ్డి
- వాలీబాల్ టోర్నీ విజేతలకు బహుమతుల ప్రదానం
వీణవంక: క్రీడలతో శారీరక దారుఢ్యంతోపాటు మానసికోల్లాసం కలుగుతుందని ఎస్‌ఐ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామంలో గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత వేసవి వాలీబాల్ శిక్షణ శిబిరం బుధవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో భాగంగా ఐదు వాలీబాల్ టోర్నమెంట్లు నిర్వహించగా, ఐదు మండలాల జట్లు పోటీలో పాల్గొన్నాయి. వీరిలో మొదటి, ద్వితీయ బహుమతులు మల్లారెడ్డిపల్లి జట్లు గోలుచుకోగా.. ఎస్‌ఐ, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఎల్లారెడ్డి, నాయకులు ముసిపట్ల తిరుపతిరెడ్డిలు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఎస్‌ఐ కృష్ణారెడ్డి మాట్లాడుతూ వేసవిలో యువకులు, ముఖ్యంగా విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా ప్రభుత్వం ఇలాంటి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. కేవలం చదువే కాకుండా నేటి యువత క్రీడల పట్ల ఆసక్తి చూపితే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈటల జనసేన నాయకులు కర్రె నాని, జయరాజ్, సమ్మిరెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.

68
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles