బీజేపీకి అధికారం అసాధ్యం

Wed,June 12, 2019 01:30 AM

-కరీంనగర్ బల్దియాపై గులాబీ జెండా ఎగరేస్తాం
-టీఆర్‌ఎస్ కార్పొరేటర్ సునీల్‌రావు
కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో, నగరం లో అధికారంలోకి వస్తామంటూ బీజేపీ నేతలు కంటున్న పగటి కలలు కలలుగానే మిగిలిపోతాయని టీఆర్‌ఎస్ కార్పొరేటర్ వై సునీల్‌రావు ఎ ద్దేవా చేశారు. మంగళవారం ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌పై బీజేపీ నేత సుగుణాకర్‌రావు చేస్తున్న విమర్శలు ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. పరిషత్ ఎన్నికల్లో 32 జడ్పీలను కైవసం చేసుకున్న ఘనత టీఆర్‌ఎ స్‌కే దక్కిందన్నారు. 10 జడ్పీటీసీలను కూడా గెల వని బీజేపీ అధికారంలోకి వస్తామనడం హాస్యా స్పదమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపును చూసి బలుపు అనుకుంటున్నారని విమర్శించా రు. మున్సిపల్ ఎన్నికల్లో పరిషత్ ఫలితాలే పు న రావృతమవుతాయన్నారు. కరీంనగర్ బల్దియా పై గులాబీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వినోద్‌కుమార్, గంగుల కమలాకర్ చొరవతో రూ. 347 కోట్లతో అభివృద్ది పనులు సాగుతున్నాయన్నారు. బీజేపీ నేతలు ఎంఐఎం బూచిచూపి ఓట్ల కోసం అడ్డదారులు తొక్కుతున్నారని ధ్వజమె త్తారు. టీఆర్‌ఎస్ నేతలు చంద్రమోళి, రాజ్‌కుమా ర్, అనిల్, వెంకట్రావు, వినోద్, హరిష్, ఆనంద్ పాల్గొన్నారు.

99
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles