సీఎంఆర్ సకాలంలో అందజేయాలి

Sat,May 25, 2019 01:48 AM

- జేసీ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్
- జిల్లాలోని పారాబాయిల్డ్ రైస్‌మిల్లర్లతో సమావేశం
కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ:వానకాలం సీజన్‌కు సంబంధించి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)ను రైస్ మిల్లర్లు వెంటనే అందజేయాలని జాయింట్ కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లా పౌరసరఫరాల అధికారులు, జిల్లాలోని పారాబాయిల్డ్ రైస్‌మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సీఎంఆర్ కింద ధాన్యాన్ని రైస్‌మిల్లర్లకు ఇచ్చామని, బియ్యాన్ని జూన్ 30లోగా అందజేయాలని తెలిపారు. ధాన్యాన్ని తీసుకున్న రైస్‌మిల్లర్లు ఓపీఎంఎస్ (ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టం) యాప్ ద్వారా వివరాలు పంపించాలన్నారు. రైస్ మిల్లర్ల కోసం ప్రభుత్వం కొత్తగా ఈ యాప్ రూపొందించిందని తెలిపారు. రైస్ మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు వెంటనే అన్‌లోడింగ్ చేసుకుని యాప్ ద్వారా తీసుకున్న ధాన్యం వివరాలు పంపించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ప్రవీణ్, పౌరసరఫరాల శాఖ నాయబ్ తాసిల్దార్లు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు, పారా బాయిల్డ్ రైస్ మిల్లర్ల యజమానులు, తదితరులు పాల్గొన్నారు.

83
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles