నేడు హుజూరాబాద్‌లో రైతు సదస్సు

Sat,May 25, 2019 01:48 AM

హుజూరాబాద్, నమస్తే తెలంగాణ: వానకాలం సాగు సన్నద్ధతపై శనివారం హుజూరాబాద్‌లోని ప్రతాపసాయి గార్డెన్‌లో డివిజన్ స్థాయి రైతు సదస్సు నిర్వహిస్తున్నామని హుజూరాబాద్ ఏడీఏ దోమ ఆదిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సదస్సులో శాస్త్రవేత్తలు సాగులో మెలకువలు చెబుతారన్నారు. ముఖ్యంగా పత్తిలో గులాబీ రంగు, మక్కజొన్నలో కత్తెర పురుగు నివారణపై సమగ్ర చర్చ ఉంటుందని తెలిపారు. విత్తన కొనుగోళ్లు, ఆగ్రో ఫారెస్ట్రీపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. ఉదయం 9గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్ హాజరుకానున్నారని తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను తొలగించడానికి సదస్సు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రైతులందరూ పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఆయన వెంట ఏఓలు సునీల్‌కుమార్, గోవర్ధన్‌రెడ్డి, వైదేహిరెడ్డి ఉన్నారు.

77
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles