జవాబుదారీతనంతో పనిచేయాలి

Thu,May 23, 2019 01:08 AM

కరీంనగర్ హెల్త్ : ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు వైద్యసిబ్బంది జవాబుదారీతనంతో పని చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాంమనోహర్‌రావు ఉపదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలందించి జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలని సూచించారు. జిల్లాలో ని ప్రోగ్రాం అధికారులు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న పర్యవేక్షక సి బ్బందికి బుధవారం ఓరియేంటేషన్ పోగ్రాం నిర్వహించా రు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మే షన్ సిస్టం ఉప కేంద్రాలు మొదలుకుని జిల్లాస్థాయి వరకు ప్రజలకు అందించే సేవలను నివేదిక రూపంలో ఉపకేంద్రం నుంచి ప్రాథమిక ఆరోగ్య కేం ద్రం వరకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రిపోర్టును స్క్రినింగ్ చేసి నివేదిక పంపించాలన్నారు. దీంతో క్షేత్రస్థాయి నుంచి జిల్లాస్థాయి సిబ్బందిలో జవాబు దారితనం పెరిగే అవకాశం ఉంటుందన్నారు. రిపోర్టులో ఎ లాంటి తప్పులు లేకుండా జిల్లాస్థాయికి ప్రతినెలా 5 లోగా పంపించాలన్నారు. ప్రతినెలా ఇవాల్సిన రిపోర్టులను పర్యవేక్షకులు వారికి సంబంధించిన పీహెచ్‌లలో హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌కు అందించాలన్నారు. రాష్ట్రస్థాయిలో జిల్లాను తొలిస్థానంలో నిలపాలంటే ఈ విధానాల ను పాటించాలన్నారు. వైద్యాధికారి వసంతరావు, కృపాబా య్, సుమన్ మోహన్‌రావు, జవేరియా, రజని, గుప్తా, కోటేశ్వర్, కాంతరావు, పుష్ప, దుర్గారావు, రవీందర్ ఉన్నారు.

88
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles