పకడ్బందీగా అంతిమయాత్ర

Thu,May 23, 2019 01:07 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌లో వినూత్నంగా ప్రవేశపెడుతున్న అంతిమ యాత్ర ఆఖరి సఫర్ పథకాన్ని పకడ్బందీగా సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని నగర మేయర్ రవీందర్‌సింగ్ తెలిపారు. బుధవారం రాత్రి స్థానిక కోర్టు రిజర్వాయర్‌లో కమిషనర్ భద్రయ్యతో కలిసి అధికారులతో విధి విధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్య తరగతి కుటుంబాలను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. శోక సముద్రంలో ఉండే కుటుంబాలకు భారం కాకుండా బల్దియానే దహన సంస్కారాలు నిర్వహిస్తుందన్నారు. ఈ పథకానికి సంబంధించి త్వరలోనే టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రకటిస్తామని తెలిపారు. ఎవరైనా దాతలు సహాయం అందిస్తే దాని కోసం ప్రత్యేక అకౌంట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ పథకంలో పారిశుధ్య కార్మికులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని, దీనిని సమర్థవంతంగా అమలు చేసేందుకు పాలకవర్గం సహ అందరూ సహకరించాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రజలు కూడా తమవంతు సహాయ సాకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. కా ర్యక్రమంలో అడిషనల్ కమిషనర్ రాజేందర్‌కుమార్, డీఈ యాదగిరి, శానిటేషన్ సూపర్‌వైజర్ వేణుగోపాల్, ఇన్‌స్పెక్టర్లు, జవాన్లు, తదితరులు పాల్గొన్నారు.

98
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles