24న అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

Thu,May 23, 2019 01:07 AM

సుభాష్‌నగర్: సీనియర్ మెన్ అండ్ ఉమెన్ అథ్లెటిక్స్ జిల్లా జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 24న అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోషియేషన్ కార్యదర్శి నందెల్లి మహిపాల్ తెలిపారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జి ల్లాల క్రీడాకారులు పాల్గొనవచ్చన్నారు. పురుషుల, మ హిళల ఎంపిక పోటీలతో పాటు 16,18,20 ఏళ్లలోపు వారికి 100, 400 మీటర్లు ఈవెంట్లలో ఎంపికచేయనున్నట్లు చెప్పారు. ఎంపికైన క్రీడాకారులను 30,31వ తేదీల్లో ఖమ్మంలో జర గనున్న రాష్ట్ర స్థాయి సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ పో టీలకు పంపనున్నట్లు చెప్పారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ నెల 24న సాయంత్రం 4 గంటలకు స్థానిక అంబేద్కర్ స్టేడియ ంలో పదవ తరగతి మెమో లేదా జనన ధ్రువీకరణ పత్రాలతో రిపోర్ట్ చేయాలని ఆయన కోరారు.

81
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles