దళిత జనోద్ధారకుడు భాగ్యరెడ్డివర్మ

Thu,May 23, 2019 01:07 AM

తెలంగాణచౌక్ : నిమ్నజాతుల జాతి చైతన్యం కో సం ఉద్యమించిన మొట్టమొదటి సంఘ సంస్కర్త, దళిత జనోద్ధ్దారకుడు మాదరి భాగ్యరెడ్డివర్మ అని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కొనియాడారు. స్థా నిక ప్రెస్‌భవన్‌లో తెలంగాణ మాల సంఘం ఆధ్వర్యంలో భాగ్యరెడ్డి వర్మ 131వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు మాజీ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య, డిప్యూటీ మేయర్ రమేశ్ పాల్గొన్నారు. భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ మద్యపాన నిషేధం, బాల్య వివాహాలు, అంటరానితనం, జోగిని లాం టి సామాజిక రుగ్మతలపై పోరాటం చేసిన మహనీయుడని ప్రశంసించారు. నిజాం కాలంలోనే పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి కృషి చేశాడని చెప్పారు. భాగ్యరెడ్డివర్మ దళిత జాతికే కాకుండా యావత్ తెలంగాణకు గర్వకారణమన్నారు. ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యం వల్ల అణిచివేతకు గురైనట్లు తెలిపారు. జ్యోతిభాపూలే, అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రావులు దేశానికి ఆస్తులని వారి ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనదని గుర్తు చేశారు. భాగ్యరెడ్డివర్మ విగ్రహాన్ని కరీంనగర్‌లో నెలకొల్పడానికి కృషి చేస్తానని ప్రకటించారు. అంబేద్కర్ భవనాన్ని కూడా ని ర్మించుకుందామనీ, అవసరమైతే అక్కడే భాగ్యరెడ్డి వర్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందామన్నా రు. బౌద్దమతం స్వీకరించిన భాగ్యరెడ్డి వర్మ తన కొడుకుకు గౌతమ్ అని పేరు పెట్టారని పేర్కొన్నారు. 1992లో ఇబ్రహీంపట్నం నుంచి గౌతం ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు ఆయన గుర్తు చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్యను ఎమ్మెల్యే సన్మానించారు. అనంతరం సుద్దాల దేవయ్య ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించారు. తెలంగాణ మాల సంఘం అధ్యక్షుడు మేదరి శ్రీనివాస్, జానపట్ల స్వామి, మేడి రాజీవ్‌తో పాటు భాగ్యరెడ్డి అభిమానులు పాల్గొన్నారు.

90
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles