నేత్రపర్వంగా లక్ష్మీనృసింహస్వామి కల్యాణం

Sat,May 18, 2019 01:10 AM

శంకరపట్నం: మండలంలోని కొత్తగట్టు శ్రీమత్స్యగిరీంద్రస్వామి గుట్టపై వెలసిన ఉగ్ర లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించే త్రయాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం యజ్ఞాచార్యులు చిమిరాల రామకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో శేషం మురళీధరాచార్యులు, శేషం రవీందరాచార్యులు స్వామి జయంతి, కల్యాణం జరిపించారు. ఉదయం మూలవరులకు పంచగన్య అమృతాభిషేకం, ఉత్సవవరులకు మంగళ స్నానం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, అంకురార్పణం, కులదేవత స్థాపన, అఖండ దీప ప్రజ్వలన, పటాధివాసం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన ధ్వజారోహణం, ఎదుర్కోలు కార్యక్రమాల్లో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 11 గంటలకు కర్కాటక లగ్న సుముహూర్తమున ఆదిలక్ష్మి, చెంచులక్ష్మిలతో స్వామి వారి కల్యాణం కన్నుల పండువగా జరిపించారు. సాయంత్రం అగ్ని ప్రతిష్ఠ, స్తాలిపాక హోమం, మూల మంత్ర హోమం, పూర్ణాహుతి, బలిహరణం, తీర్థగోష్ఠి నిర్వహించారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామి వారి కల్యాణాన్ని తిలకించి పులకించిపోయారు. అలాగే స్వామి వారికి కట్న కానుకలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మొకిరాల కిషన్‌రావు, ఎంపీటీసీ ఉప్పుగల్ల మల్లారెడ్డి, ఉప సర్పంచ్ బోడ సుధాకర్, దాతలు లక్ష్మణ్‌రావు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

73
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles