వైభవంగా రేణుకా ఎల్లమ్మ జాతర

Fri,May 17, 2019 01:21 AM

గన్నేరువరం: మండలంలోని గునుకులకొండాపూర్‌లో శ్రీరేణుకా ఎల్లమ్మ జాతర వైభవంగా సాగింది. జాతర ఉత్సవాల్లో భాగంగా రజక, గౌడ కులస్థులు పోశమ్మకు బోనాలు చేశారు. గురువారం చివరి రోజు ఎల్లమ్మకు బైండ్ల పూజారులు పట్నం వేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి కొత్త బట్టలు సమర్పించి, ఓడి బియ్యం పోశారు. గ్రామస్తులు ఇంటికో బోనం చేయగా మహిళలు నెత్తిపై ఎత్తుకొని డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తరలివెళ్లారు. బోనాల్లో తెచ్చిన నైవేద్యం అమ్మవారికి సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. జడ్పీటీసీ తన్నీరు శరత్‌రావు, ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా కో-ఆర్డినేటర్‌ గూడెల్లి తిరుపతి, సర్పంచ్‌ లింగంపెల్లి జ్యోతి, ఉప సర్పంచ్‌ హన్మండ్ల పద్మ, ఎంపీటీసీ కొర్వి సంధ్యారాణి, మాజీ సర్పంచ్‌ సుధగోని మల్లేశం గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కాంతాల విక్రమ్‌రెడ్డి, లింగంపెల్లి నాగరాజు, కొర్వి తిరుపతి, లింగంపెల్లి బాలరాజు, న్యాలపట్ల పర్శరాం గౌడ్‌, తాళ్లపెల్లి శ్రీనివాస్‌ గౌడ్‌, తాళ్లపెల్లి రవిగౌడ్‌లు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు న్యాలపట్ల బాలయ్యగౌడ్‌, తాళ్లపెల్లి పర్శరాం గౌడ్‌, న్యాలపట్ల లక్ష్మణ్‌ గౌడ్‌, నాగపూరి శంకర్‌ గౌడ్‌, తాళ్లపెల్లి రఘురాం గౌడ్‌, భక్తులు పాల్గొన్నారు.

84
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles