శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు

Thu,May 16, 2019 01:21 AM

- సీపీ కమలాసన్‌రెడ్డి
కరీంనగర్‌ క్రైం: కమిషనరేట్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు సీపీ కమలాసన్‌రెడ్డి వెల్లడించారు. నగరంలోని భగత్‌నగర్‌లో బుధవారం పోలీసులు కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఉదయం 5.30 నుంచి 7.30 వరకు ఇళ్లు, అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం కాలనీవాసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు అదుపులోకి వస్తాయన్నారు.

సీసీ కెమెరాల ద్వారా నెలకు 10 నుంచి 15 నేరాల్లో నిందితులు దొరుకుతున్నట్లు వెల్లడించారు. ప్రతీ పౌరుడు యూనిఫాం లేని పోలీసుగా భావించి పోలీసులకు తమవంతు సహకారం అందించాలని కోరారు. నంబర్‌ ప్లేట్‌ లేకుండా వాహనాలు నడపడం నేరమనీ, ఉద్దేశపూర్వకంగా నెంబర్‌ ప్లేట్‌ కన్పించకుండా చేయడం, తప్పుడు నెంబర్‌ ప్లేటు ఏర్పాటు చేసుకునే వారిపై క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. 10 వేల సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామనీ, ఇప్పటి వరకు 5 వేలకు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కమిషనరేట్‌ వ్యాప్తంగా డీజేల వినియోగం నిషేధించడం జరిగిందనీ, ఎవరైనా డీజేలను ఏర్పాటు చేసి ఇబ్బందులకు గురిచేస్తే డయల్‌ 100కు సమాచారం అందించాలన్నారు.


అన్ని వర్గాల ప్రజల సౌకర్యార్థం పోలీస్‌శాఖ నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా హ్యాక్‌ఐ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఈ సందర్భంగా 10 వేల విలువ గల నిషేధిత పొగాకు ఉత్పత్తులు, సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌, ఏసీపీ ఉషారాణి, ఇన్‌స్పెక్టర్లు తుల శ్రీనివాస్‌రావు, దేవారెడ్డి, విజయ్‌కుమార్‌, ఆర్‌ఐలు మల్లేశం, జానిమియా, లతో పాటు వివిధ విభాగాలకు చెందిన 150 మంది పోలీసులు పాల్గొన్నారు.సీసీ కెమెరాల ఏర్పాటుకు విరాళం సీసీ కెమెరాల ఏర్పాటుకు భగత్‌నగర్‌ వాసులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రూ. 4 లక్షల విరాళం ప్రకటించారు. 15 రోజుల వ్యవధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. \

102
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles