వైభవంగా లక్ష్మీనారసింహుడి నవరాత్రోత్సవాలు

Wed,May 15, 2019 01:28 AM

-ఐదో రోజు స్వామివారలకు సహస్ర కళశాభిషేకం..
-పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
ధర్మపురి, నమస్తేతెలంగాణ: ధర్మపురి క్షేత్రం లో లక్ష్మీనరసింహస్వామివారి నవరాత్సోత్సవా లు పురస్కరించుకొని ఐదో రోజూ మంగళవారం స్వామివారికి పంచోప నిషత్తులతో సహస్ర కళశాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం పూర్ణాహుతి చేపట్టారు. అ నంతరం ఆలయ వేద పండితులు బొజ్జ రమేశ్‌ శర్మ ఆధ్వర్యంలో పండితులు, రుత్వికులు మం త్రోచ్ఛరణల మధ్య స్థాపితా దేవతా పూజలు, కలశస్థాపన, హోమాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. లోక కల్యాణార్థం యాగశాల వద్ద యజ్ఞాచార్యులు కందాళై పురుషోత్తమాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు హోమం చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ ద్యావళ్ల కిరణ్‌, ధర్మకర్తలు అక్కనపల్లి సునీల్‌కుమార్‌, ఇనుగంటి వేంకటేశ్వర్‌రావ్‌, ఎం భాగ్యలక్ష్మి, మామిడి లింగన్న, జెట్టి రాజన్న, సాయిని శ్రీనివాస్‌, జోగినపల్లి రమాదేవి, మధు నటరాజ్‌శర్మ, దోమకొండ తిరుపతి, పండితులు బొజ్జ రమేశ్‌శర్మ, ఎం శర్మ, ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, వేద పండితులు రమేశ్‌ శర్మ, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచార్యులు, అర్చకులు నంబి నరసింహమూర్తి, అర్చకులు, సిబ్బంది, పట్టణ ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

72
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles