టాప్ 3 మనదే..!

Tue,May 14, 2019 04:51 AM

ముకరంపుర/కరీంనగర్ ఎడ్యుకేషన్: పదోతరగతి ఫలితాల్లో జిల్లా మళ్లీ విజయకేతనం ఎగురవేసింది. 98.38 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే తృతీయ స్థానం సాధించింది. గత ఏడాది ద్వితీయ స్థానంలో నిలిచినప్పటికీ ఈసారి తృతీయ స్థానం దక్కింది. రాష్ట్రంలోనే మంచి ఉత్తీర్ణత శాతం సాధించేందుకు జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, విద్యాశాఖ విస్తృత కసరత్తు చేయడంతో పాటు.. ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు చేసిన పక్కా ప్రణాళికలు ఫలించాయి.

98.38 శాతం
జిల్లాలో మొత్తం 14,162 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, అందులో 13,932 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 7,525 మందికి గాను 7,406 విద్యార్థులు (98.42) ఉత్తీర్ణులయ్యారు. అలాగే బాలికలు 6,637 మందికి గాను 6,526 మంది (98.33) శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా చూస్తే జిల్లా 98.38 శాతంతో రాష్ట్రంలోనే తృతీయ స్థానంలో నిలిచింది. ఇందులో కేవలం 230 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించలేదు. 116 ప్రభుత్వ పాఠశాలలతో పాటు, 121 ప్రైవేటు పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత ఫలితాలు సాధించారు. ఈ పరీక్షా ఫలితాలపై ఏమైనా సందేమాలుంటే రీవెరిఫికేషన్, జవాబు పత్రాల జిరాక్స్ ప్రతుల కోసం రూ.1000 చలానా, కేవలం మార్కుల రీకౌంటింగ్ కోసం రూ.500ల చలానా ద్వారా చల్లించి దరఖాస్తు ఫారాలను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి ఈ నెల 27లోపు సమర్పించాలన్నారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ దరఖాస్తు ఫారాలను www.bse. telangana.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని డీఈవో ఎస్ వెంకటేశ్వర్లు సూచించారు.

ఫలించిన ప్రయోగం
గతేడాది ద్వితీయ స్థానంలో ఉన్న జిల్లాను ఈసారి ప్రథమ స్థానంలోకి తేవాలన్న లక్ష్యంతో జిల్లా విద్యాశాఖ కసరత్తు చేసింది. ముఖ్యంగా ఈసారి జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. ముందు నుంచే ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు ప్రణాళికలకు పదును పెట్టారు. గత ఏడాది నవంబర్ 1 నుంచే ఉదయం పూట ప్రత్యేక తరగతులు నిర్వహించే ప్రక్రియ చేపట్టారు. అలాగే డిసెంబర్ నుంచి ఉదయం, సాయంత్రం రెండు దఫాలుగా ప్రత్యేక తరగతులు నిర్వహించారు.

ప్రభుత్వ పాఠశాలల హవా
పదో తరగతి ఫలితాల్లో అత్యధిక జీపీఏలను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించడం విశేషం. ఫలితాల పురోగతిని పరిశీలిస్తే... జిల్లాలో మొత్తం 131 ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలకు 95 శాతం పాఠశాలలు వంద శాతం సాధించి మొదటి స్థానంలో నిలిచాయి. ఈ పాఠశాలల్లో మొత్తం 3753 విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 3673 విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 1904కు 1857 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 1849 మందికి, 1816 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండో స్థానంలో మాడల్ స్కూల్స్ మంచి ప్రతిభను కనబర్చి 11 పాఠశాలలకు 8 పాఠశాలల్లో వంద శాతాన్ని అందుకున్నాయి. బాలురు 435, బాలికలు 641 మొత్తం 1076 మందికి బాలురు434, బాలికలు 639 మంది ఉత్తీర్ణత సాధించారు. 11 కస్తూర్భా గాంధీ పాఠశాలల్లో ఆరు పాఠశాలలు వంద శాతాన్ని సాధించి జిల్లాలో మూడో స్థానంలో నిలిచాయి. 339 మొత్తం విద్యార్థులకు గాను 329 మంది ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ వసతి పాఠశాలల నాలుగు పాఠశాలలకు 3 పాఠశాలలు వంద శాతాన్ని అందుకున్నాయి. ఇందులో మొత్తం 383 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 381 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 20 ప్రభుత్వ పాఠశాలలకు గాను రెండు ప్రభుత్వ పాఠశాలలు వంద శాతాన్ని సాధించాయి. ఇందులో మొత్తం 877 మంది పరీక్షలకు హాజరు కాగా, 802 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎయిడెడ్ నాలుగు పాఠశాలలకు ఒక పాఠశాల వంద శాతం సాధించగా, 228 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 223 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మహత్మా జ్యోతిరావు పూలేకు చెందిన ఒక పాఠశాల వంద శాతం సాధించింది. 39 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుగకాగా 39 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 161 ప్రైవేటు పాఠశాలల్లో మొత్తం 7467 విద్యార్థులు హాజరు కాగా 7412 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 121 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి.

154
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles