నామినేషన్లను జాగ్రత్తగా పరిశీలించాలి

Fri,April 26, 2019 01:06 AM

హుజూరాబాద్, నమస్తే తెలంగాణ/జమ్మికుంట/మానకొండూర్/శంకరపట్నం: పరిషత్ ఎన్నికల నామినేషన్లను జాగ్రత్తగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులకు సూచించారు. గురువారం పట్టణంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల పరిశీలనను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్రిమినల్ కేసుల్లో పూర్తిస్థాయిలో ఆధారాలుంటేనే నామినేషన్‌ను తిరస్కరించాలని సూచించారు. ఎంపీటీసీల నామినేషన్ల తిరస్కరణపై జడ్పీ సీఈవోకు, జడ్పీటీసీల నామినేషన్ తిరస్కరణపై కలెక్టర్‌కు అప్పీలు చేసుకోవాలన్నారు. ఎన్నికల నియమ నిబంధనలను పాటించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా ఎన్నికల సహాయ అధికారి ప్రావీణ్య, ఆర్డీవో చెన్నయ్య, ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఇన్‌చార్జి ఈవోపీఆర్డీ జున్నూతుల రేవంత్‌రెడ్డితోపాటు రిటర్నింగ్ అధికారులు, తదితరులున్నారు. అలాగే, ఇల్లందకుంట, జమ్మికుంట మండలాల జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సందర్శించారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా పనిచేయాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. ఆయా పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు బీ ఫాంలు ఈ నెల 28లోగా అందజేసే అవకాశం ఉందనీ, 28న మధ్యాహ్నం 3గంటల వరకు బీ ఫాంలు తీసుకొని పార్టీ గుర్తులు కేటాయించాలని చెప్పారు. బీ ఫాంలు లేని అభ్యర్థులను ఇండిపెండెంట్లుగా గుర్తించాలనీ, సదరు అభ్యర్థులకు ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారంగా గుర్తులు కేటాయించాలని సూచించారు. ఇక్కడ ప్రత్యేకాధికారి ప్రావీణ్య, హుజూరాబాద్ ఆర్డీవో చెన్నయ్య, జమ్మికుంట, ఇల్లందకుంట ఎంపీడీవోలు, తాసీల్దార్ జయశ్రీ, డాక్టర్ కే నారాయణ, సీఐ సృజన్‌రెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

మానకొండూర్‌లో: మానకొండూర్ మండల పరిషత్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. నామినేషన్ల పరిశీలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఎంపీడీవో దేవదాస్, రిటర్నింగ్ అధికారులు చక్రవర్తి, వెంకటేశ్వర్లు, తదితరులున్నారు. అలాగే, శంకరపట్నం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. స్క్రూటినీ నిర్వహిస్తున్న రిటర్నింగ్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీవో వినోద, రిటర్నింగ్ అధికారులు, తదితరులున్నారు.

121
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles