నేడు రెండో మోటర్‌కు పరీక్ష

Thu,April 25, 2019 03:34 AM

ధర్మారం: నందిమేడారం టన్నెల్ పంప్‌హౌస్‌లో బుధవారం తొలిమోటర్ వెట్న్‌న్రు విజయవంతంగా నిర్వహించిన ఇంజినీరింగ్ అధికారులు, నేడు రెండో మోటర్ ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు సర్జ్‌పూల్ డ్రాఫ్ట్ ట్యూబ్ ద్వారా 3,200 క్యూసెక్కుల నీటిని మోటార్‌లోకి పంపి నీటి పరీక్షలు నిర్వహించి, ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని అధికారులు నిర్ధారించారు. గురువారం రెండో మోటర్ వెట్న్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ ఎస్‌కె జోషి ముఖ్య అతిథిగా హాజరవుతారని ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. అలాగే సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ వచ్చే అవకాశముందని సమాచారం. కాగా, పంప్‌హౌస్‌లో ఒక్కో మోటర్ 127.6 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఏడు మోటార్లను ఏర్పాటు చేస్తుండగా, ఇప్పటికే నాలుగు అందుబాటులోకి రాగా, 5వ మోటార్ చివరి దశలో ఉంది. 6,7 శరవేగంగా పూర్తవుతున్నాయి. ఇందులో ఇప్పటికే 1, 2 పంపులకు డ్రైరన్ పూర్తికాగా, బుధవారం మొదటి పంప్ వెట్న్ నిర్వహించారు. నేడు రెండో మోటార్ ద్వారా నీటిని ఎత్తిపోయనున్నట్లు ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు తెలిపారు.

103
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles