అభివృద్ధిని చూసే చేరికలు

Thu,April 25, 2019 03:34 AM

చొప్పదండి, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఐదేళ్లలో జరిగిన అభివృద్ధికి ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆకర్షితులై టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మండలంలోని కొలిమికుంట సర్పంచ్ సుజాతతోపాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లపెల్లి శ్రీనివాస్ సుమారు ఐదు వందల మంది నాయకులు, కార్యకర్తలతో కలిసి బుధవారం ఎమ్మెల్యే రవిశంకర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరా రు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలకు చోటేలేకుండా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా జాతీయ పార్టీలని చెప్పుకునే కాంగ్రెస్, టీడీపీలు చివరకు కార్యకర్తలు కూడా లేకుండా అవసాన దశకు చేరుకున్నాయన్నారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి ప్రత్యేక తెలంగాణ వరకు ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాం గ్రెస్ దేశానికి చేసిందేమిలేదని ఆ పార్టీలో పనిచేసిన నాయకులే గుర్తించారన్నారు. మూసదోరణితో కాంగ్రె స్ అదిష్టానం అభివృద్ధి నిరోధకంగా మారిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీకి నూకలు చెల్లాయనీ, కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ కనిపించకుండా పోయే అవకాశం ఉందన్నారు. దీనికి కారణం రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే కారణమని స్పష్టం చేశారు. గౌడ సంఘం, ముదారిజ్ సంఘం, మున్నూరుకాపు, రజక, అంబేద్కర్, పూజల సంఘ అధ్యక్షులతో పాటు ఐదు వందల మంది పార్టీలో చేరగా, కం డువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారి లో కొలిమికుంట ఉప సర్పంచ్ సత్తు తిరుపతి, వార్డు సభ్యులు ఆకుల సురేశ్, నెల్లి లక్ష్మయ్య, మాజీ ఉప సర్పంచ్ చొక్కల లచ్చయ్య, మండల కాంగ్రెస్ మై నార్టీ సెల్ అధ్యక్షుడు చాంద్‌పాషా, ఎన్‌ఎస్‌యూఐ మండలాధ్యక్షుడు పబ్బా సత్యం, పలు సంఘాల అధ్యక్షులు తిరుపతి, భూమయ్య, ఓదెలు, పెరుమాం డ్ల వెంకట్రాజంగౌడ్, ముకాస మాజీ అధ్యక్షుడు సత్తు మోహన్, తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో గ్రం థాలయ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, ఎంపీపీ గుర్రం భూంరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

87
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles