రైజింగ్‌సన్ యూత్‌కు ఉత్తమ యువజన సంఘం అవార్డు

Thu,April 25, 2019 03:33 AM

కరీంనగర్ స్పోర్ట్స్: నెహ్రూ యువ కేంద్ర(ఎన్‌వైకే) కరీంనగర్ 2017-18 సంవత్సరానికి గాను రైజింగ్‌సన్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు ఉత్తమ యువజన సంఘం అవార్డు దక్కింది. రామడుగు మండలం కొక్కెరకుంట గ్రామానికి చెందిన అసోసియేషన్ బాధ్యులకు బుధవారం కలెక్టర్ క్యాంపులో జరిగిన ఓ కార్యక్రమంలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అవార్డును అందజేశారు. కలెక్టర్ యూత్ సభ్యులను అభినందించి, ప్రోత్సాహకంగా రూ.25వేలతోపాటు మెడల్స్‌ను అందజేశారు. ఎన్‌వైకే సహాయకులు బి.రవీందర్, రైజింగ్‌సన్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గజ్జెల అశోక్, అధ్యక్ష, కార్యదర్శులు గజ్జెల నవీన్‌కుమార్, జేరిపోతుల మహేశ్, ఎన్‌వైకే పొగ్రాం కోఆర్డినేటర్ ఎ.ప్రమోద్ పాల్గొన్నారు.

126
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles