నెరవేరుతున్న కాళేశ్వర స్వప్నం

Wed,April 24, 2019 01:33 AM

- నేడే నందిమేడారాన తొలిమోటార్‌కు వెట్న్
- సర్వం సిద్ధం చేసిన నీటిపారుదల, ఇంజినీరింగ్ అధికారులు
- తాజాగా మొదటి పంపునకు నీటి పరీక్షలు పూర్తి
- ప్రస్తుతం సర్జ్‌పూల్‌లో 142.1 మీటర్ల దాకా నీళ్లు
- టన్నెల్‌లోనే మకాం వేసిన ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి
ధర్మారం: తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసిన రాష్ట్ర సర్కారు, వీలైనంత త్వరగా రైతాంగానికి అందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు నీటి తరలింపులో భాగంగా ఆరు, ఏడు, ఎనిమిది ప్యాకేజీలు కీలకం కావడంతో ప్రత్యేక దృష్టితో ముందుకుసాగుతున్నది. ఈ మేరకు ఇప్పటికే ఇక్కడి ఆరు, ఎనిమిది అండర్ టన్నెళ్లలో ఏర్పాటు చేసిన మోటార్ల డ్రైరన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన యంత్రాంగం, వాటి వెట్న్(్రనీటిని ఎత్తిపోసే పద్ధతిని పరీక్షించే ప్రక్రియ) నిర్వహించేందుకు సన్నద్ధమైంది. ఈ మేరకు ఈ నెల 17న ఎల్లంపల్లి జలాలను విడుదల చేయగా, గ్రావిటీ కాలువ నుండి టన్నెళ్ల ద్వారా 9.54 కిలో మీటర్లు ప్రయాణించి, సర్జ్‌పూల్‌లోకి చేరింది. ఈ క్రమంలో లీకేజీలపై ప్రధాన దృష్టి సారించి, మూడు రోజులుగా గజ ఈతగాళ్లలో శోధన చేయించి చివరకు ఎలాంటి లీకేజీలూ లేవని నిర్ధారించుకున్నది. అలాగే సర్జ్‌పూల్ నుంచి 3,200 క్యూసెక్కుల నీటిని పంప్‌హౌస్‌కు పంపి, అక్కడి నుంచి మోటార్‌కు పంపి నీటి పరీక్షలు పూర్తి చేసి, వెట్న్‌క్రు సమాయత్తమైంది.

ఫలించిన అధికారుల కృషి
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా ఎల్లంపల్లి నుంచి జలాలను నందిమేడారం సర్జ్‌పూల్‌లోకి పంపించడంలో భాగంగా అక్కడ వేంనూర్ నుంచి ఇక్కడ టన్నెల్ దాకా నీటి తరలింపునకు అధికారులు చేసిన కృషి ఫలించింది. ఈ ప్రక్రియనంతా ప్రాజెక్ట్ ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు అధ్వర్యంలో ఎత్తిపోతల పథకం సలహాదారు పెంటారెడ్డి, ఈఈ నూనె శ్రీధర్, ఏఈలు ఉపేందర్, రాకేశ్, శ్రీనివాస్, నర్సింగారావు, ప్రాజెక్ట్ పనులు చేపట్టిన నవయుగ కంపెనీ డైరెక్టర్ వెంకట రామారావు, ప్రాజెక్ట్ డీజీఎం శ్రీనివాస్‌రావు, తదితరులు అండర్‌టన్నెల్‌లోనే మకాం వేసి నిత్యం పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి సర్వం సిద్ధం చేశారు.

* సర్జ్‌పూల్‌లో 142.1 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్ వద్ద నీరు
ఈ నెల 17 నుంచి ఎల్లంపల్లి జలాలు సర్జ్‌పూల్‌కు చేరుతున్న క్రమంలో లీకేజీలు ఏమైనా ఉన్నాయా..? అని తెలుసుకునేందుకు అధికారులు మూడు రోజుల పాటు శ్రమించారు. విశాఖపట్నం నుంచి 10 మంది గజ ఈతగాళ్లను రప్పించి, శోధన చేయించారు. సర్జ్‌పూల్‌లోకి ఏడు గేట్ల పరిశీలనను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఎక్కడా ఎలాంటి లీకేజీలూ లేవని నిర్ధారణకావడంతో సోమవారం, మంగళవారం మళ్లీ ఎల్లంపల్లి నుంచి నీటిని విడుదల చేసి సర్జ్‌పూల్‌లో 142.1 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్ దాకా నీటిని నిల్వ చేశారు. అనంతరం అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ క్రష్‌గేట్లను మూసివేశారు.

లాంఛనంగా వెట్న్
నందిమేడారం టన్నెల్‌లోని పంప్‌హౌస్‌లో ఒక్కో మోటార్ 127.6 మెగావాట్ల సామర్థ్యం చొప్పున మొత్తం ఏడు మోటార్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఇప్పటికే మూడు మోటార్ల డ్రైరన్ ఇప్పటికే పూర్తికాగా, ఇందులో మొదటి మోటార్ వెట్న్‌న్రు బుధవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం దాకా సర్జ్‌పూల్ మొదటి గేట్ నుంచి డ్రాఫ్ట్ ట్యూబుల ద్వారా 3,200 క్యూసెక్కుల నీటిని పంప్‌హౌస్‌లోని మొదటి పంపునకు పంపించి నీటి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశారు. బుధవారం ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి ఆధ్వర్యంలో వెట్న్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ చేశారు. కాగా, వెట్న్‌ల్రో భాగంగా ఈ పంప్ నుంచి నీరు 340 మీటర్ల దూరం పాటు పైపుల ద్వారా వెళ్లి, డెలివరీ మెయిన్ నుంచి టన్నెల్ ఆరు బయట ఉన్న డెలివరీ సిస్టర్న్‌లోకి పంపింగ్ అవుతుంది. సిస్టర్న్ ద్వారా బయటకు వచ్చిన నీరు 550 మీటర్ల పొడవుతో నిర్మించిన లీడ్ చానల్ గుండా నంది మేడారం రిజర్వాయర్‌లోకి వెళ్తుంది. కాగా, మొదటి పంప్ విజయవంతంగా పూర్తయితే మిగతా పంపుల ద్వారా వెట్న్ నిర్వహిస్తామని ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు తెలిపారు.

112
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles