టీఆర్‌ఎస్‌తోనే గ్రామాల అభివృద్ధి

Wed,April 24, 2019 01:31 AM

- పరిషత్ ఎన్నికల్లోనూ గెలిపించాలి
- కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలి
- ఎమ్మెల్యే గంగుల కమలాకర్
- గులాబీ పార్టీలో వంద మంది చేరిక
కరీంనగర్ రూరల్: తెలంగాణ రాష్ట్ర సమితితోనే గ్రామాల అభివృద్ది సాధ్యమని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం మీసేవా కార్యాలయంలో కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ సభ్యులు పండుగ నర్సయ్యతో పాటు, 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గులాబి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ గ్రామాలాభివృద్ది చెందాలంటే స్థానిక సంస్థల ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంతో గ్రామాల అభివృద్ది సాధ్యమని గమనించిన వివిధ పార్టీల నాయకులు టీఆర్‌ఎస్ పార్టీలో తీర్థం పుచ్చుకుంటున్నార అన్నారు. పండుగ నర్సయ్య చేరికతో పార్టీకి మరింత బలం చేకురుతుందని, కొత్త పాత తేడా లేకుండా, అందరు కలిసి కట్టుగా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కొత్తపల్లి మండలంలోని జెడ్పీటీసీ తో పాటు, 8 ఎంపీటీసీ స్థానాలు, కరీంనగర్ రూరల్ మండలంలోని జెడ్పీటీసీ తోపాటు, 12 ఎంపీటీసీ స్థానాలను తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను గెలిపించుకొవాలని, గ్రామాల అభివృద్దికి అందరు సహకరించాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.

గ్రామాల్లో ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పైన నమ్మకం ఉందన్నారు. గత 2018 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అత్యధికంగా ఎమ్మెల్యే సీట్లను గెలిపించి, ప్రజలు తమ నమ్మకాని చాటుకున్నారని వివరించారు. అదే స్పూర్తితో స్థానిక సంస్థల ఎన్నికలలో రెండు జెడ్పీటీసీలను, 20 ఎంపీటీసీ సభ్యులను గెలుచుకుంటామనే ధీమా వ్యక్తం చేశారు.సాథ్యమైన్నని ఎంపీటీసీలకు ఏకగ్రీవం చేసుకొవడానికి కార్యకర్తలు, నాయకులు సహకరించాలని అన్నారు. స్థానిక సంస్థ ఎన్నికలలో కాంగ్రెస్,బిజెపి పార్టీలు టీఆర్‌ఎస్ కు పోటీ ఇచ్చే ప్రసక్తిలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి గెలుస్తుందని, తాటాకు చప్పుడ్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారని, గతంలో ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాలమ ముందు ఇలాగే ఇలాంటి తాటాకు చప్పుడ్లు చేసినట్లు గుర్తు చేశారు.

ఇప్పటికి గ్రామాల్లో తాగునీరు , సాగునీరుకు డోక్కలేదని, ఇట్టివలననే కాళేశ్వరం ప్రాజెక్ట్ టయల్ రన్ పూర్తి చేశారని, గ్రామాల్లో రైతులు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరతో అనందంగా ఉన్నారని, దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుల కష్టాలను చూసి, రైతు బంధువు పథకం ప్రవేశపెట్టారని అన్నారు. ఇప్పటికే మిషన్ కాకతీయ ద్వారా ఎన్నో చెరువులను పునరుద్దరించారని ఆయన పేర్కోన్నారు. కొత్తపల్లి ఊర చెరువు, చెర్లభూత్కూర్ పెద్ద చెరువును ఎస్‌ఆర్‌ఎస్‌పీ నీటితో నింపడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. వరద కాలవ నుండి ఆచాంపల్లి వరకు నిర్మించే కాల్వ పూర్తి అయితే, దానికి కింద ఆదార పడిన ఆరు గ్రామాలు బీడు భూములు సస్యశ్యామలం అవుతాయని పేర్కోన్నారు. గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను అత్యధిక మేజార్టీతో స్థానిక సంస్థలలో గెలిపించాలని ప్రజలను కోరారు, తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపుతోనే గ్రామాలు సంపూర్ణ అభివృద్ది చేందుతాయని,బంగారు తెలంగాణకు బాటలు వేస్తారని ఆయన వివరించారు

కాంగ్రెస్ పార్టీ నుండి చేరిన నాయకులు
పండుగ నర్సయ్య, దేవునూరి చంద్రయ్య, లంక శంకర్, సిరిసిల్ల రాజేందర్, సొమిడి అంజయ్య, దేవునూరి రవీందర్, మాతంగి అంజయ్య, కోడూరి అజయ్, దేవునూరి రంజీత్, అనుమండ్ల నర్సయ్య, పిట్టల వీరేందర్, పండుగ శ్రవణ్, ఎనుగంటి రాజ్‌తో పాటు 100 మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ వాసాల రమేష్, మాజీ ఎమ్మెల్యే కొడూరి సత్యనారాయణ గౌడ్, కొత్త శ్రీనివాస్ రెడ్డి,డీప్యూటి మేయర్ గుగ్గిళపు రమేష్. జెడ్పీటీసీ ఏడ్ల శ్రీనివాస్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు ఎండి జమిల్లోద్దిన్,మల్కాపూర్ గ్రామ సర్పంచ్ గుట్ట జ్యోతి పోచయ్య, కాశెట్టి శ్రీనివాస్. మాజీ సర్పంచ్ కాసారపు శ్రీనివాస్ గౌడ్, గంగాధర లక్ష్మయ్య, ఒల్లాల మల్లేశం, సుంకిశాల సంపత్‌రావు, గంగాధర చందు, తుల బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.

111
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles