వైద్యరంగంలో ఆదర్శంగా నిలుస్తాం

Mon,April 22, 2019 01:14 AM

- దేశంలో మొదటి స్థానానికి చేరుతాం
- పేదలకు ఉచిత వైద్యమందించడమే సీఎం లక్ష్యం
- సంపూర్ణ ఆరోగ్యంతోనే బంగారు తెలంగాణ సాధ్యం
- రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
- వైద్యులపై దాడులకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం : ఎంపీ వినోద్‌కుమార్
- ఐఎంఏ జోనల్ కాన్ఫరెన్స్‌కు హాజరు
కరీంనగర్ హెల్త్: దేశంలోనే తెలంగాణ రాష్ట్రం వైద్య రంగంలో మూడవ స్థానంలో ఉందని, ఇది త్వరలోనే మొదటి స్థానానికి చేరి రాష్ట్రం దేశానికే రోల్‌మోడల్ కానుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని లోటస్ హోటల్‌లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) రాష్ట్రస్థాయి మొదటి జోనల్ కాన్ఫరెన్స్, జోన్-2వ కాన్ఫరెన్స్‌కు ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎంపి వినోద్‌కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదేళ్లకు ఉచితంగా వైద్యాన్ని అందించడమే లక్ష్యమని, వీటితో పాటు పెన్షన్లు, రైతుబంధుతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. బంగారు తెలంగాణ అంటే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్య తెలంగాణతోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే విజ్ఞానం పెంపొందుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులను చేపట్టామని, రానున్న రోజుల్లో మరిన్ని మార్పులతోనే ఆరోగ్య తెలంగాణకు బాటలు వేసే దిశగా పయనిస్తామన్నారు.

వైద్యం కోసం వెచ్చిచేందుకు ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఏ మాత్రం లేదని, ప్రభుత్వం మార్వాడి కొట్టుకాదని లాభ నష్టాలను చూసుకోదన్నారు. పేద ప్రజల సంక్షేమం, అభివృద్దే ప్రభుత్వ ధ్యేయమన్నారు. చట్టాలను సమయానుకూలంగా మార్చుకోవచ్చునన్నారు. మెడికల్ కౌన్సిల్ లైసెన్స్‌లను ఐదు సంవత్సరాలకు కాకుండా 10 సంవత్సరాలకుకొకసారి రెన్యూవల్ చేసుకొనే అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. దవాఖానాలు ప్రాణదాతలే కావాలి కానీ ప్రమాదాలు సంబవించకుండా చూసుకోవాల్సిన బాధ్యత వైద్యులదేనన్నారు. ఫైర్ సేప్టీ అనేది అందిరికీ రక్షణ కవచం లాంటిందన్నారు. ప్రభుత్వం వైద్యుల సలహాలు, సూచనలు తీసుకొని ప్రజల ఆరోగ్యం కోసం కృషిచేస్తామన్నారు. కరీంనగర్ ఎంపీ బి వినోద్‌కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ స్మార్ట్ సిటీ జాబితాలో చేరిందన్నారు. వైద్యులు, దవాఖానాలపై దాడులను టీఆర్‌ఎస్ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకిస్తుందన్నారు. వైఎస్‌ఆర్ తీసుకువచ్చిన చట్టానికి తాము మద్దతు ఇచ్చామని గుర్తు చేశారు. వైద్యులు విలువలకు అనుగుణంగా వైద్య సేవలందించాలన్నారు.

పార్లమెంట్‌లో ఎంసీఐ యాక్ట్, బిల్లు విషయంలో తాము ముందున్నామన్నారు. ప్రభుత్వం దృష్టికి వైద్యుల సమస్యలను తీసుకువెళ్లి వాటి పరిష్కారంకు కృషిచేస్తామన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ జాతీయస్థాయిలో ఒకటే ఐఎంఎ ఉండటం అనేది వైద్యుల ఐక్యతకు నిదర్శనమన్నారు. ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ బియన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం హెల్త్‌పాలసీ ప్రకటించే ముందు వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల ఏర్పాటుకు సరళీకృతమైన విదానాలను తీసుకురావాలన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ జె శివరాజ్, ఐఎంఎ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ప్రతాప్‌రెడ్డి, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ రవీందర్‌రెడ్డి, ఆసుపత్రి బోర్డు చైర్మన్ రవీందర్‌రావు, ఐఎంఎ నూతన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విజేందర్‌రెడ్డి, అపోలో రీచ్ అడ్మినిస్ట్రేటర్ బాబూరావు, సీనియర్ వైద్యులు భూంరెడ్డి, జగన్‌మోహన్‌రావు, శ్రీధర్‌రావు, సాగర్‌రావు, పొలాడి శ్రీనివాసరావు, తిరుపతిరెడ్డి, విజయమోహన్‌రెడ్డి, శ్యాంసుందర్, సంజీవ్‌సింగ్, అలీం, చిట్టిమల్ల ప్రదీప్, వెంకట్‌రెడ్డి, వాసుదేవ శ్రీనివాస్, పివికె కిషోర్, శ్రీలతారెడ్డి, బంగారి రజని ప్రియదర్శిని, విజయలక్ష్మీ, ఝాన్సీ, రత్నమంజరి, తదితరులు పాల్గొన్నారు.

128
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles