ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి

Sun,April 21, 2019 01:13 AM

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని జాయింట్ కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో కార్యాలయంలో 2018-19 రబీ ధా న్యం కొనుగోలుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలన్నారు. రబీ సీజన్‌లో మంజూరైన ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నింటిని వెంటనే ప్రారంభించాలని ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, మెప్మా అధికారులను జేసీ ఆదేశించారు. అన్ని కేం ద్రాల్లో తాగునీరు, నీడ, ఎలక్ట్రానిక్ కాంటాలు, టార్పలిన్‌లు, ధాన్యం శుభ్రం చేసే యంత్రాలు ఇతర మౌ లిక వసతులు కల్పించాలన్నారు. కొనుగోలు కేం ద్రాలకు రైతులందరూ తమ ధాన్యాన్ని ఒకేసారి తీసుకురాకుండా గ్రామాల్లో వారికి సూచించాలన్నారు. జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ప్రవీన్, డీసీఎంఎల్ మేనేజర్ వెంకటేశ్వర్‌రావు, ఎపీఎంఎస్ రవివర్మ, రాజేశం, పవన్, జిల్లా సహకార అ ధికారి కార్యాలయ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉన్నారు.

మిల్లులకు తరలించాలి..
గంగాధర: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని అదనపు డీఆర్డీఓ బొజ్జ వెంకటేశ్ సిబ్బందికి సూచించారు. మండలంలోని ఉప్పరమల్యాల, గర్శకుర్తి గ్రామా ల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా 17 ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండలం లో ప్రారంభించామన్నారు. అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యాన్ని వెంట వెం టనే తూకం వేసి మిల్లులకు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంలు జ్యోతి, పవన్, కేంద్రాల నిర్వాహకులు ఉన్నారు.

77
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles