ఘనంగా కొప్పుల జన్మదిన వేడుకలు

Sun,April 21, 2019 01:13 AM

టవర్‌సర్కిల్: ధర్మపురి శాసనసభ్యుడు, రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణచౌక్ లో జరిగిన కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సీనియర్ నా యకుడు గాండ్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కొప్పుల జన్మదిన కేక్‌ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జీఎస్ ఆనంద్, ఖదీర్, నయూం, ఇమ్రాన్, కరీం, గీతాంజలి, మధుసూదన్, ఇక్బాల్, వెంకటరమణ, మల్లిఖార్జున్, సతీష్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

సహాయ అనాథ ఆశ్రమ కేంద్రంలో...
తీగలగుట్టపల్లిలోని సహాయ ఆనాధ ఆశ్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలను విద్యార్థుల మధ్య నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహాకురాలు గుర్రం పద్మ కేక్‌కట్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశా రు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

80
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles