అంజనాద్రి

Sat,April 20, 2019 12:52 AM

- కొండగట్టుకు పోటెత్తిన దీక్షాపరులు
- మార్మోగిన రామ, హనుమ నామ స్మరణ
- కనుల పండువలా అంజన్న చిన్నజయంతి వేడుకలు
- కాషాయ మయమైన గుట్ట పరిసరాలు
- సుమారు 50వేల మంది మాల విరమణ

మల్యాల : కొండగట్టులో హనుమాన్ చిన్నజయంతి వేడుకలు శుక్రవారం కనులపండువలా సాగాయి. ఉ ప్పెనలా తరలివచ్చిన దీక్షాపరులతో గుట్టంతా కాషా య శోభితమైంది. గురువారం సాయంత్రం నుంచే దీక్షా విరమణ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగగా, శుక్రవారం మధ్యాహ్నం లోపు సుమారు 50వేల మంది దీక్ష విరమించినట్లు అధికారులు తెలిపారు.

ఉప్పెనలా రాక
జయంతికి ముందు రోజైన గురువారం సూర్యాస్తమయం నుంచి దీక్షాపరుల రాక ప్రారంభమైంది. వివి ధ ప్రాంతాల నుంచి పాదయాత్రగా వచ్చిన స్వాములు గుట్ట కింద, చెట్ల కింద సేదతీరి ఎండ తగ్గగానే గుట్టపైకి ఉప్పెనలా తరలిరావడం కనిపించింది. అర్ధరాత్రి 12 తర్వాత మాల విరమణకు సిద్ధమయ్యారు. దీంతో పాత, కొత్త కోనేరు, మాల విరమణ మండపం కిక్కిరిసిపోయాయి. అర్ధరాత్రి నుంచి శుక్రవారం సాయం త్రం వరకు మాల విరమణ, దర్శనాలను నిర్విరామం గా కొనసాగించారు. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు దీక్షాపరుల సంకీర్తనలతో మార్మోగిన కొండగట్టు, శుక్రవారం మధ్యాహ్నం నుంచే భక్తులు లేక బోసిపోయింది.

పకడ్బందీ చర్యలు
జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ, మల్యాల సీఐ నాగేందర్, మల్యాల ఎస్‌ఐ ఉపేంద్రాచారి, తమ సిబ్బందితో పకడ్బందీ బందోబస్తు చర్యలు చేపట్టి దీక్షాపరులు సాఫీగా మాల విరమణ, కేశఖండనం, దర్శ నం, ప్రసాదాల కొనుగోలు చేసుకొని స్వామి వారిని దర్శించుకొని తిరిగి వెళ్లేలా చూశారు. ఆలయం, పోలీ స్ ఔట్ పోస్టుల్లోని సీసీ కెమెరాల కంట్రోల్ రూము ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మైక్ ద్వారా, ప్రత్యక్షంగా సలహాలు సూచనలు అందించారు.

మేము సైతం అంటూ మహిళలు...
హనుమాన్ చిన్న జయంతికి దీక్షాపరులతో పాటు వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా మహిళలు సైతం పాదయాత్రగా కొండగట్టుకు తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన కొండగట్టుకు చేరుకొని తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. పలు స్వచ్ఛంద సేవా సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేసి భక్తులకు ఉచితంగా మంచి నీటిని అందించాయి. కరీంనగర్‌కు చెందిన వరసిద్ధి వినాయక సేవా సమితి ప్రకాశం గంజ్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.

నిరంతరాయంగా టికెట్,
ప్రసాద విక్రయ కౌంటర్లు
గుట్టపై గల బస్టాండ్ వద్ద 20 గదుల ధర్మశాలలో ఏర్పాటు చేసిన టికెట్, ప్రసాద విక్రయ కేంద్రాలు ని రంతరాయంగా పనిచేశాయి. ఘాట్ రోడ్డు, మెట్లదారి, బొజ్జపోతన, మాలవిరమణ మండపాల వద్ద విక్రయ కౌంటర్లను నిరంతరం నడిపించారు. ఆలయ ఈవో అమరేందర్, ఏఈవో బుద్ది శ్రీనివాస్, సూపరింటెండెంట్ శ్రీనివాస శర్మ, ఆంజనేయులు, ఆలయ ఏఈ లక్ష్మణ్‌రావు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వర్‌రావు, సం పత్, ఆలయ సిబ్బంది డీ సునీల్, జెమిని శ్రీనివాస్, కలకోట శ్రీనివాస్, కే శ్రీనివాసాచారి, రాజేందర్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలీస్ ఔట్ పోస్టు, వా హన పూజా స్థలం, బొజ్జపోతన వద్ద మల్యాల పీహెచ్‌సీ సిబ్బంది మెడికల్ క్యాంపులు పెట్టి భక్తులకు వైద్య సేవలు అందించారు.

స్వయంగా కలెక్టర్, ఎస్పీ పరిశీలన
ఉత్సవాల్లో భాగంగా గురువారం అర్ధరాత్రి కలెక్టర్ శరత్, ఎస్పీ సింధూశర్మ, ఆర్డీవో డాక్టర్ ఘంటా నరేందర్ స్వయంగా ఆలయ ప్రాంగణంలో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సౌకర్యాలపై భక్తుల అభిప్రాయాలు సేకరించి వారి సూచనల మేరకు మరిన్ని ఏ ర్పాట్లు చేయాలని ఈవో అమరేందర్‌ను కలెక్టర్ ఆదేశించారు. పాత కోనేరు, కొత్త కోనేరు నీటి నిల్వ విషయంలో ఆలయ సిబ్బంది పనితీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి ఆలయ పరిసరాల్లో నే బస చేసి శుక్రవారం స్వామి వారికి ప్రత్యేక పూజ లు చేసి ఉత్సవాలను పర్యవేక్షించారు. ఎస్పీ సింధూశర్మ అర్ధరాత్రి దాటిన తర్వాత భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో స్వయంగా తానే దగ్గరుండి బందోబస్తు ఏర్పాట్లు చూసుకున్నారు.

ఉచితంగా ఆర్టీసీ సేవలు
భక్తుల కోసం ఆర్టీసీ అధికారులు పార్కింగ్ స్థలం నుంచి వై జంక్షన్ వరకు, వై జంక్షన్ నుంచి పార్కింగ్ స్థలం వరకు మినీ బస్సుల ద్వారా ఉచితంగా రాకపోకల సౌకర్యం కల్పించారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జీవన్ ప్రసాద్, జగిత్యాల, వేములవాడ ఆర్టీసీ డిపోల మేనేజర్లు జగదీశ్వర్, భూపతిరెడ్డి కొండగట్టులో అందుబాటులో ఉంటూ భక్తుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు నడుపుతూ సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు.

163
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles