పరిషత్ ఎన్నికల్లో సత్తాచాటాలి

Sat,April 20, 2019 12:51 AM

సైదాపూర్: రానున్న ప్రాదేశిక పరిషత్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ శ్రేణులు సత్తాచాటాలనీ, పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించుకునేందుకు కృషి చేయాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండలకేంద్రంలోని పాతబస్టాండ్ వద్ద టీఆర్‌ఎస్ మండల కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. గ్రామాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయన్నారు. వీటిపై మరింతగా ప్రచారం చేయాలన్నారు. గ్రామాల వారీగా కార్యకర్తలందరూ ఐక్యంగా ఉండి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. పార్టీ కోసం పని చేసే వారందరికీ తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందని స్పష్టంచేశారు. టీఆర్‌ఎస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బిల్ల వెంకటరెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య, వావిలాల ఖాదీబోర్డు డైరెక్టర్ పేరాల గోపాలరావు, సింగిల్‌విండో చైర్మన్ సారాబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ మండల కోఆర్డినేటర్ రావుల రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌లు చంద శ్రీనివాస్, బత్తుల కొంరయ్య, తొంట కమల, బొడిగె పద్మజ, అబ్బిడి పద్మ, ఎంపీటీసీ మునిగంటి స్వామి, టీఆర్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు ఓరుగంటి దేవేంద్ర, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

104
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles