జ్యోతిష్మతిలో ప్రాజెక్ట్ ఎక్స్‌పో

Thu,April 18, 2019 01:15 AM

తిమ్మాపూర్, నమస్తే తెలంగాణ: మండలంలోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం నిర్వహించిన ప్రాజెక్ట్ ఎక్స్‌పో ప్రదర్శన ఆకట్టుకున్నది. కళాశాలలోని అన్ని ఇంజినీరింగ్ విభాగాల విద్యార్థులతోపాటు పాలిటెక్నిక్ చివరి సంవత్సరం విద్యార్థులు వివిధ అంశాల్లో 131 ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు, ప్రిన్సిపాల్స్ డాక్టర్ జీ లక్ష్మీనారాయణరావు, డాక్టర్ వైశాలి, అకాడమిక్ డీన్ ఎస్‌వీఎస్ రామకృష్ణంరాజులు మాట్లాడారు. విద్యార్థులు మంచి ప్రాజెక్టులు రూపొందించారని అభినందించారు. స్టార్టప్ ఐడియాలు, ప్రోటోటైప్ మోడల్స్‌కు కళాశాల యజమాన్యం స్పాన్సర్‌షిప్ చేస్తుందన్నారు. పాలిటెక్నిక్ చివరి సంవత్సరం చదువుతున్న మహ్మద్ జునైద్ ప్రదర్శించిన అట్మాస్ జ్యోతిష్మతి జునైద్ రైఫిల్ డ్రోన్ అందరినీ ఆకట్టుకోగా కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్‌రావుతోపాటు డైరెక్టర్ కే వెంకట్రావ్‌లు విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ డ్రోన్ తయారీ విద్యార్థుల్లోని అంతర్లీన ప్రతిభకు కొలమానమని అభివర్ణించారు. అలాగే ఇతర విద్యార్థులు వివిధ అంశాల్లో రూపొందించిన ప్రాజెక్టులు ప్రదర్శించి వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల యాజమాన్యంతోపాటు అధ్యాపకులు అభినందించారు

116
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles