ప్రాదేశిక ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కే పట్టం

Wed,April 17, 2019 12:46 AM

సైదాపూర్: రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ప్రజల మద్దతు తెలంగాణ రాష్ట్ర సమితికే ఉంటుందనీ, పార్టీ అభ్యర్థులను ఎన్నుకుని మరోసారి టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టనున్నారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, వావిలాల ఖాదీ బోర్డు డైరెక్టర్ పేరాల గోపాలరావు పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌నే ఆదరించిన విషయాన్ని గుర్తుచేశారు. లోక్‌సభ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ నేతృత్వంలో గ్రామాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయని చెప్పారు. రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలు వివరించాలని సూచించారు. గ్రామాల వారీగా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. జిల్లాలో అన్ని జడ్పీటీసీ స్థానాలు గెలిచి జడ్పీ పీఠం కైవసం చేసుకోవాలన్నారు. ఆయన వెంట సర్పంచ్‌లు చంద శ్రీనివాస్, తాటిపల్లి యుగేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు చెలిమెల రాజేశ్వర్‌రెడ్డి, తాటిపల్లి జితేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

96
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles