విలీన గ్రామాల్లో పారిశుధ్య పనులు

Wed,April 17, 2019 12:46 AM

- బల్దియా కమిషనర్ సత్యనారాయణ
-కారొబార్లు, కార్యదర్శులతో సమావేశం
కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను చేపడుతామని నగర మేయ ర్ రవీందర్‌సింగ్, కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. అధికారులు, గ్రా మస్తులు, యువజన సంఘాలతో కలి సి స్వచ్ఛ భారత్, సర్వేక్షణ్ కార్యక్రమాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. విలీన గ్రామాల కార్యదర్శులు, కారో బార్లతో తన చాంబర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గ్రామాల్లో తలెత్తుతున్న ప్రధాన సమస్యలు, పన్నుల వసూళ్లు, గృహాల అనుమతులు, పెన్షన్ దరఖాస్తులను, నీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణపై సిబ్బందికి సూచనలు చేశారు. పంచాయితీ కార్యదర్శులు, కారొబార్లు విధుల్ల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు చేపడుతామన్నారు. సిబ్బందిపై ఫిర్యాదులు వస్తే చర్యలు చేపడుతామన్నారు. గ్రామాల్లో వచ్చే దరఖాస్తులను అక్కడే తీసుకొని రెండు రోజుల కోక్కసారి రిపోర్టు చేయాలని పేర్కొన్నారు. పారిశుధ్య పనులకు సక్రమంగా నిర్వహించాలనీ, అవసరమయ్యే పనిమట్లు, డంపర్‌బిన్స్ రిక్షాల కోసం ప్రతిపాదనలు పంపి సామగ్రిని తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఏసీ రాజేంద్రకుమార్, డీసీ స్వరూపారాణి, ఏసీసీలు వందనం, కోటేశ్వర్, ఆర్వో రాములు నగరపాలక సిబ్బంది, విలీన గ్రామాల సిబ్బంది పాల్గొన్నారు.

169
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles