అర్హులందరికీ పాసు పుస్తకాలు

Wed,April 17, 2019 12:45 AM

-పంపిణీ ప్రక్రియలో వేగం పెంచాలి
- జాయింట్ కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్
కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలోని అర్హులైన రైతులందరికీ పాసు పుస్తకాలు జారీ చేయాలని జాయింట్ కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్ తహసీల్దార్లను ఆదేశించారు. పంపిణీ ప్రక్రియలో వేగం పెంచాలని సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, భూ రికార్డులపై తహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు కేసులు లేని భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. పట్టాదారు చనిపోతే వారి వారసులకు భూమిని వెంటనే మార్పిడి చేయాలని సూచించారు. భూ క్రయ విక్రయాల్లోనూ వెంటనే మ్యూటేషన్ చేయాలన్నారు. జిల్లాలో రైతు ఖాతాలకు ఆధార్‌తో అనుసంధానం కాని వాటిని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలపై విచారణలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ భూ ఖాతాలను ధరణి వెబ్‌సైట్‌లో మార్కు చేయాలని కోరారు. ఆన్‌లైన్‌లో భూముల వివరాలను వారంలోగా నిక్షిప్తం చేయాలని సూచించారు. సమావేశంలో కరీంనగర్, హుజురాబాద్ రెవెన్యూ డివిజన్ల అధికారులు ఆనంద్‌కుమార్, చెన్నయ్య, అన్ని మండలాల తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

122
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles